సోమవారం, మార్చి 07, 2016

ఒక్కడే ఒక్కడే...

మిత్రులందరకూ మహా శివరాత్రి శుభాకాంక్షలు. శ్రీమంజునాథ చిత్రంలోని ఓ చక్కని పాటను వింటూ ఈ పర్వదినాన శివ నామస్మరణ చేద్దాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : శ్రీమంజునాథ (2001)
రచన : భారవి
సంగీతం : హంసలేఖ
గానం : ఎస్ పి బాలు

ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
శక్తి కి ద్రక్తి కి ఒక్కడే
భక్తి కి ముక్తి కి
ఒక్కడే దిక్కొక్కడే

నువ్వు రాయి వన్నాను లేనేలెవన్నాను
మంజునాధ మంజునాధ
పరికించె మనసు ఉంటె నీలోనె ఉన్నానన్నావు
లోకాల దొరకాదు దొంగవని చాటాను
మంజునాధ మంజునాధ
నా పాప రాసులన్ని దొంగల్లె దోచుకు పోయావు
శిక్షకు రక్షకు ఒక్కడే
కర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడే

ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే

శంకర శంకర
హర హర శంకర
మురహర భవహర
శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రకరా
జయ జయ శంభో జయ జయ చంద్రకరా

నా ఆర్తి తీర్చావు
నా దారి మార్చావు
మంజునాధ మంజునాధ
నా అహంకారాన్ని కాల్చి భస్మం చేసావు
నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు
 
మంజునాధ మంజునాధ 
సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు
దేవుడు జీవుడు ఒక్కడే
ధర్మము మర్మము ఒక్కడే అవునొక్కడే

శంకర శంకర
హర హర శంకర
మురహర భవహర
శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రకరా
జయ జయ శంభో జయ జయ చంద్రకరా
శంకర మురహర శంభో హర హరా
 

మంజునాధ మంజునాధ
మంజునాధ మంజునాధ
 

2 comments:

చక్కని భక్తీ గీతం, మంచి చిత్రం ఇచ్చారు. ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.