బుధవారం, మార్చి 02, 2016

నువ్వంటే నా నవ్వు...

కృష్ణగాడి వీర ప్రేమ గాథ చిత్రంలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. వీడియో టీజర్ ఇక్కడ చూడచ్చు.


చిత్రం : కృష్ణగాడివీరప్రేమ గాథ (2016)
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం : కృష్ణకాంత్
గాన : హరిచరణ్, సింధూరి విశాల్

నువ్వంటే నా నవ్వు
నేనంటేనే నువ్వు
నువ్వంటూ నేనంటూ లేమనీ
అవునంటూ మాటివ్వు
నిజమంటూనే నువ్వు
నే రాని దూరాలె నువ్ పోనని

ఎటు ఉన్నా నీ నడక
వస్తాగా నీ వెనక
దగ్గరగా రానీను దూరమే
నే వేసే ప్రతి అడుగు
ఎక్కడికో నువ్ అడుగు
నిలుచున్నా నీవైపే చేరేనులే

నీ అడుగేమో పడి నేల గుడి అయినదే
నీ చూపేమో సడిలేని ఉరుమయినదే
నువ్వు ఆకాశం నేను నీకోసం
తడిసిపోదామ ఈ వానలో

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే
నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే
ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమా.

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే
నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే
ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమా.
 
నే ఇటు వస్తాననుకోలేదా
తలుపస్సలు తీయవు తడితే
పో పసివాడని జాలే పడితే
బుగ్గన ముద్దిచ్చి చంపేసావే

నువ్వూ నేనంటూ పలికే పదముల్లో
అధరాలు తగిలేనా కలిసే వున్నా
మనమంటూ పాడు పెదవుల్లో చూడు
క్షణమైనా విడిపోవులే

ఇది ఓ వేదం పద రుజువవుదాం
అంతులేని ప్రేమకే మనం
నివురు తొలగేలా నిజము గెలిచేలా
మౌనమే మాట మార్చేసినా

నువ్ నవ్వేటి కోపానివే
మనసతికిన ఓ రాయివే
నువ్ కలిసొచ్చే శాపానివే
నీరల్లే మారేటి రూపానివే

నచ్చే దారుల్లోనడిచే నదులైనా
కాదన్నా కలవాలి సంద్రములోన
విడివిడిగా వున్నా విడిపోలేకున్నా
ప్రవహించే ప్రణయం ఇదే

వొద్దన్నా తిరిగేటి భువిమీదొట్టు
నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ
నాలోనే నువ్వుంటూ నీతోనే నేనంటూ
ఈ భువిలో విహరించే వెలుగే మన ప్రేమా


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.