సోమవారం, ఫిబ్రవరి 08, 2016

గువ్వ గోరింకతో...

రాజ్ కోటి గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఓ హుషారైన ప్రేమగీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఖైదీ నంబర్ 786 (1988)
సంగీతం : రాజ్-కోటి 
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, జానకి

గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట 
ఆడుకోవాలి గువ్వలాగ
పాడుకుంటాను నీ జంట గోరింకనై
గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట
 
జోడుకోసం గోడ దూకే వయసిది
తెలుసుకో అమ్మాయిగారు
అయ్యొపాపం అంత తాపం
తగదులే తమరికి అబ్బాయిగారు 
ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం
ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం 
కోరుకున్నానని ఆట పట్టించకు
చేరుకున్నానని నన్ను దోచేయకు  
చుట్టుకుంటాను సుడిగాలిలా ...

హోయ్... గువ్వ.. హా.. గోరింకతో.. హా.. 
ఆడిందిలే బొమ్మలాట
హోయ్.. నిండు.. హా.. నా గుండెలో హా.. 
మ్రోగిందిలే వీణపాట.. హోయ్.. హోయ్..

కొండనాగు తోడు చేరి
నాగిని బుసలలో వచ్చే సంగీతం 
సందెకాడ అందగత్తె
పొందులో ఉందిలే ఎంతో సంతోషం
పువ్వులో మకరందము ఉందే నీ కోసం  
తీర్చుకో ఆ దాహము వలపే జలపాతం
కొంచెమాగాలిలే కోర్కె తీరేందుకు 
దూరముంటానులే దగ్గరయ్యేందుకు
దాచిపెడతాను నా సర్వమూ ...
 
హోయ్... గువ్వ.. హాయ్.. గోరింకతో.. హాయ్.. 
ఆడిందిలే బొమ్మలాట
అహా.. నిండు.. హా.. నా గుండెలో హా
మ్రోగిందిలే వీణపాట.. ఆడుకోవాలి గువ్వలాగ
పాడుకుంటాను నీ జంట గోరింకనై

 
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.