గురువారం, ఫిబ్రవరి 11, 2016

హాయ్ రే హాయ్ జాంపండురోయ్...

సింధూరం చిత్రంలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సింధూరం (1998)
సంగీతం : శ్రీ
సాహిత్యం : చంద్రబోస్
గానం : శ్రీ

హాయ్ రే హాయ్ జాంపండురోయ్
హాయ్ రే హాయ్ జాంపండురోయ్
కళ్ళ ముందు కదులుతొంది రొయ్ ముద్దుగా
ఏం రూపు రా  ఏం రంగు రా
ఏం రూపు రా  ఏం రంగు రా
సొంతమైతే అంత కన్ననా అయ్య బాబొయ్
హాయ్ రే హాయ్ జాంపండురోయ్
హాయ్ రే హాయ్ జాంపండురోయ్
చూడగానే నోరూరెరా తియ్యగా
ఏం రూపు రా  ఏం రంగు రా
ఏం రూపు రా  ఏం రంగు రా
సొంతమైతే అంత కన్ననా అయ్య బాబొయ్

  
అందమైన కొన సీమ కొబ్బరాకు లా
తెల్లవారి వెలుగు లోన తులసి మొక్క లా
పెరటిలోన పెంచుకున్న ముద్దబంతి లా
పెరుగులోన నంజుకున్న ఆవకాయ లా
బుట్టబొమ్మలా పాలపిట్టలా గట్టుదాటు గోదారిలా
యెయ్యెయ్యె యెయె యెయె యెయ్యెయ్యె
హొయ్ తేనె చుక్క లా వాన చినుకులా
మామ్మ గారి ముక్కు పుడక లా వుంది పిల్ల

హాయ్ రే హాయ్ జాంపండురోయ్
హాయ్ రే హాయ్ జాంపండురోయ్

 
పాత తెలుగు సినీమాలో సావిత్రి లా

ఆలయాన వెలుగుతున్న చిన్ని దివ్వె లా
తామరాకు వొంటి పైన నీటి బొట్టు లా
వాకిలంత నిండి వున్న రంగు ముగ్గులా
చేప పిల్లలా చందమామలా
ముద్దు ముద్దు మల్లె మొగ్గ లా
యెయ్యెయ్యె యె యెయ్యెయ్యెయ్య్య్
ఒయి చెరుకు పంట లా భోగి మంట లా
పసుపు రంగు ఇంటి గడపలా వుంది పిల్ల
హాయ్ రే హాయ్ జాంపండురోయ్
హాయ్ రే హాయ్ జాంపండురోయ్
కళ్ళముందు కదులుతోంది రోయ్ ముద్దుగా
ఏం రూపు రా  ఏం రంగు రా
ఏం రూపు రా  ఏం రంగు రా
సొంతమైతే అంత కన్ననా అయ్య బాబొయ్


హాయ్ రే హాయ్ జాంపండురోయ్..

హాయ్ రే హాయ్ జాంపండురోయ్

 యెయ్యెయ్యె యె యెయ్యెయ్యెయ్య్య్ యెయెయె యె
యెయ్యెయ్యె యె యెయ్యెయ్యెయ్య్య్ యెయెయె యె

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.