గురువారం, ఫిబ్రవరి 04, 2016

నేను నీకై పుట్టినానని...

చంటబ్బాయ్ సినిమాలోని ఓ చక్కని ప్రేమగీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చంటబ్బాయి (1986)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు, సుశీల

నేను నీకై పుట్టినానని
నిన్ను పొందకా మట్టికానని
చెమ్మగిల్లే కనులతో
చేయి పట్టే మనసుతో
చేసుకున్న బాసలో
ఊసులేప్రేమ..
ఊపిరే ప్రేమ..

నిన్ను చూడకా నిదురపోనీ రెండు నేత్రాలు
కలల హారతి నీకు పట్టే మౌన మంత్రాలు
నిన్ను తాకకా నిలవలేనీ పంచ ప్రాణాలూ
కౌగిలింతలా గర్భగుడిలో మూగ దీపాలు
ప్రేమ మహిమ తెలుప తరమా
ప్రేమే... జీవన మధురిమా

నేను నీకై పుట్టినానని
నిన్ను పొందకా మట్టికానని
చెమ్మగిల్లే కనులతో
చేయి పట్టే మనసుతో
చేసుకున్న బాసలో
ఊసులేప్రేమ..
ఊపిరే ప్రేమ..

స్త్రీ అనే తెలుగక్షరంలా నీవు నిలుచుంటే
క్రావడల్లే నీకు వెలుగులా ప్రమిదనై ఉంటా
ఓం...అనే వేదాక్షరంలా నీవు ఎదురైతే
గానమై నిన్నాలపించే..ప్రణవమై ఉంటా
ప్రేమ మహిమ తెలియ తరమా
ప్రేమే... జీవన మధురిమా 

నేను నీకై పుట్టినానని
నిన్ను పొందకా మట్టికానని
చెమ్మగిల్లే కనులతో
చేయి పట్టే మనసుతో
చేసుకున్న బాసలో
ఊసులేప్రేమ..
ఊపిరే ప్రేమ..
 
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.