ఆదివారం, ఫిబ్రవరి 28, 2016

నువ్వేం మాయ చేశావో గాని...

ఒక్కడు చిత్రం కోసమ్ మణిశర్మ సంగీత సారధ్యంలో సిరివెన్నెల గారు వ్రాసిన ఓ చక్కని ప్రేమగీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఒక్కడు (2003)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కార్తీక్, శ్రేయా ఘోషల్

నువ్వేం మాయ చేశావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ
నువ్వేం మాయ చేశావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ

హాయ్‌రే హాయ్‌రే హాయ్ అందని
రేయి చాటు రాగం విని
ఎవరు తనని పిలిచారని 
అడిగి చూడు నీ మనసుని
హే కాలాన్నే కదలనీయని
కనికట్టేం జరగలేదని
ఈ తీయని మాయ 
తనదని తెలుసా అని
 
మనసూ నీదే మహిమా నీదే
పిలుపూ నీదే బదులూ నీదే

నువ్వేం మాయ చేశావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ
నువ్వేం మాయ చేశావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ

మూగ మనసిది ఎంత గడుసిది
నంగనాచి సంగతులెన్నో వాగుతున్నది
ఓహో ఇంత కాలము కంటి పాపలో
కొలువున్న కల నువ్వే అంటున్నది

హాయ్‌రే హాయ్‌రే హాయ్ అందని
రేయి చాటు రాగం విని
ఎందుకులికి పడుతోందని
అడిగి చూడు నీ మనసుని
హే నిదురించే నీలి కళ్ళలో
కల ఎప్పుడు మేలుకున్నదో
ఆ కల ఏం వెతుకుతున్నదో 
తెలుసా అని

కనులూ నీవే కలలూ నీవే
పిలుపూ నీదే బదులూ నీదే

నువ్వేం మాయ చేశావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ
నువ్వేం మాయ చేశావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ

పిచ్చి మనసిది హా.. ఎంత పిరికిది
నచ్చుతానో లేదో నీకు అడగమన్నది
ఓహో ఆశ ఆగక అడుగు సాగక
అలలాగా ఎగిరెగిరి పడుతున్నది

హాయ్‌రే హాయ్‌రే హాయ్ అందని
రేయి చాటు రాగం విని
గాలి పరుగు ఎటువైపని
అడిగి చూడు నీ మనసుని
హేయ్ ఏ దారిన సాగుతున్నదో
ఏ మజిలీ చేరుకున్నదో
ఏ తీరం కోరుతున్నదో 
తెలుసా అనీ

పదమూ నీదే పరుగూ నీదే
పిలుపూ నీదే బదులూ నీదే

నువ్వేం మాయ చేశావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోనీ
నువ్వేం మాయ చేశావో గాని
అహాహాహ..మ్మ్..ఆహ..


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.