మంగళవారం, ఫిబ్రవరి 23, 2016

జివ్వుమని కొండగాలి...

లంకేశ్వరుడు సినిమాలోని ఓ హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : లంకేశ్వరుడు (1989)
సంగీతం : రాజ్-కోటి 
సాహిత్యం : దాసరి 
గానం : మనో, జానకి

జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది
వెచ్చనీ.. కోరికా.. రగిలిందిలే
నీవే నా ప్రేయసివే
నీకేలే అందుకో ప్రేమ గీతం

కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది
తియ్యనీ.. కానుకా.. దొరికిందిలే
నీవే నా ప్రేమవులే
నీకేలే అందుకో ప్రేమ గీతం

 
జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది

ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది 
కాశ్మీర కొండల్లో అందాలకే
కొత్త అందాలు ఇచ్చావో..
కాశ్మీర వాగుల్లో పరుగులకే
కొత్త అడుగుల్ని నేర్పావో..
నేనే నిను కోరి చేరి వాలి పోవాలి

కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది

 
మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు 
మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు
కొమ్మల్లొ పూలన్ని పానుపుగా
మన ముందుంచే పూలగాలీ..
 
పూవుల్లొ దాగున్న అందాలనే
మన ముందుంచే గంధాలుగా..
నేనే నిను కోరి చేరి వాలి పోవాలి
 
జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది
కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.