శుక్రవారం, ఫిబ్రవరి 19, 2016

యుగాలెన్ని రానీ పోనీ...

ముకుంద చిత్రం కోసం సిరివెన్నెల గారు వ్రాసిన ఓ అందమైన ప్రేమగీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. సినిమాలో ఒక చరణం మాత్రమే ఉపయోగించుకోవడం వల్ల ఎంబెడ్ చేసిన వీడియోలో సగమే ఉంటుంది. పూర్తి పాట లిరిక్స్ వీడియో ఇక్కడ.


చిత్రం : ముకుంద (2014)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : మిక్కీ జె మేయర్, సాయి శివాని

దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్

యుగాలెన్ని రానీ పోనీ
ముగింపంటు లేనేలేనీ
కథే మనం కాదా అననీ...
సమీపాన వున్నాగానీ
కదల్లేని ఈ దూరాన్నీ
మరో అడుగు ముందుకు రానీ..

నిను నను జత కలిపితె గాని
తన పని పూర్తవదనుకోని
మన వెనుకనె తరుముతు రానీ
ఈ క్షణాన్నీ...
గడిచిన ప్రతి జన్మ రుణాన్ని
మరిచిన మది నిదరని కరిగించే..
నిజం ఇదే..నని
మరి ఒకసారి ముడిపడుతున్న
అనుబంధాన్ని చూడని

దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్

ప్రతి మలుపు దారి చూపద
గంగా సాగర సంగమానికి
ప్రతి చినుకు వంతెనేయద
నింగీ నేలని కలపడానికి
ఏ కాలం.. ఆపిందీ.. 
ఆ కలయికనీ...
ప్రణయమెపుడు అడిగిందీ
ఎటు ఉంది తొలకరి రమ్మనీ
ఎపుడెదురవుతుంది తానని

దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్

ఏ స్వప్నం తనకి సొంతమో
చూపించాలా కంటి పాపకి
ఏ స్నేహం తనకి చైత్రమో
వివరించాలా పూల తోటకీ
వేరెవరో... చెప్పాలా... 
తన మనసిదనీ..
కాని ఎవరినడగాలి
తానేవ్వరి గుండెల గూటిలో
ఊపిరిగా కొలువుండాలని

దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.