ఇళయరాజా గారు స్వరపరచిన ఓ చక్కని ప్రేమగీతాన్ని ఈ రోజు విందామ్. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : సూర్య IPS (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఈ చిటాపటా చింత నీ దయే కదా అంతా
ఇక చేసేదేముంది అయ్యోరామా..
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఏపుగ ఊగే ఒంపుల పైరూ
కోతకు సైయందే హ హ హ హా
ఊపుగ రేగే చూపుల ఏరూ
కోకను కోసిందే.. ఏ..ఏ..ఏ..
కొంగెక్కి కూసే రంగుల ఊసే
ఒంగొంగి చూసే లొంగని ఆశే
వెర్రెక్కే కన్నూ వేటాడెనే నిన్నూ
ఏమూల దాచేదీ సింగారం
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఈ చిటాపటా చింత నీ దయే కదా అంతా
ఇక చేసేదేముంది అయ్యోరామా..
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఏటికి సైతం ఏతం వేసే వేగం బాగుందే..
పైటకు సైతం పాటలు నేర్పే రాగం లాగిందే..
ఏకల్లే చేరి మేకైనావూ
సోకుల్లో ఊరి చెలరేగావూ
తాంబూలం తెచ్చా.. తడి పొడి పంచా
ఎన్నాళ్ళు మోస్తావు.. వయ్యారం
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
ఈ చిటాపటా చింత నీ దయే కదా అంతా
ఇక చేసేదేముంది అయ్యోరామా..
ఓం నమో నమా యవ్వనమా రావమ్మా
ఏం మహత్యమో హాయి సుమా ఈ ప్రేమా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.