మిత్రులకు వేలంటైన్స్ డే శుభాకాంక్షలు. ఈ రోజు రహమాన్ సంగీత సారధ్యంలో వచ్చిన ఓ అందమైన ప్రేమ గీతాన్ని తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
ఎవ్వరికి ఎవ్వరినీ జంటగా అనుకుంటాడో
మనసా మళ్ళీ మళ్ళీ చూశా
మనసా మళ్ళీ మళ్ళీ చూశా
తీయనైన చీకటిని తలుచుకునే వేకువలూ
మనసా మళ్ళీ మళ్ళీ చూశా
ప్రేమ జగం... ఓ... ఓ...
చిత్రం : ఏమాయ చేసావె (2010)
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : దేవన్ ఏకాంబరం, చిన్మయి
ఎవ్వరికి ఎవ్వరినీ జంటగా అనుకుంటాడో
ఆఖరికి వాళ్లనే ఓ చోట కలిపేస్తాడు
మనసా మళ్ళీ మళ్ళీ చూశా
గిల్లీ గిల్లీ చూశా జరిగింది నమ్మేశా
జతగా నాతో నిన్నే చూశా
నీతో నన్నే చూశా
నను నీకు వదిలేశా
పై లోకంలో వాడు
ఎపుడో ముడి వేశాడు
విడిపోదే విడిపోదే
తను వాన విల్లంటా
నువు వాన జల్లంటా
మీలోని ఈ ప్రేమ
కిరణం.. కిరణం
తను కంటి పాపంటా
నువు కంటి రెప్పంటా
విడదీయలేమంటా
ఎవరం.. ఎవరం
మనసా మళ్ళీ మళ్ళీ చూశా
నీ కళ్ళల్లో చూశా నూరేళ్ళ మన ఆశా
జతగా నాతో నిన్నే చూశా
నాతోడల్లే చూశా నీవెంట అడుగేసా
తీయనైన చీకటిని తలుచుకునే వేకువలూ
హాయి మల్లె తీగలతో వేచి ఉన్నా వాకిలిలూ
నింగి నేల గాలి నీరు నిప్పు అన్నీ
అవిగో స్వాగతమన్నాయి
తను వాన విల్లంటా
నువు వాన జల్లంటా
మీలోని ఈ ప్రేమ
కిరణం.. కిరణం
తను కంటి పాపంటా
నువు కంటి రెప్పంటా
విడదీయలేమంటా
ఎవరం ఎవరం
మనసా మళ్ళీ మళ్ళీ చూశా
నీ కళ్ళల్లో చూశా నూరేళ్ళ మన ఆశా
జతగా నాతో నిన్నే చూశా
నాతోడల్లే చూశా నీవెంట అడుగేసా
పై లోకంలో వాడు
ఎపుడో ముడి వేశాడు
విడిపోదే విడిపోదే
తను పాలవెల్లంటా
నువు వాన జల్లంటా
నీలోని ఈ ప్రేమ
తీరడం తీరడం
తను కంటి పాపంటా
నువు కంటి రెప్పంటా
విడదీయలేమంటా
ఎవరం.. ఎవరం
ప్రేమ జగం... ఓ... ఓ...
విడుచు క్షణం... ఓ... ఓ...
పెళ్లి అనుకుంటే... ఓ... ఓ...
కలియుగమే ముగిసేది... ఓ... ఓ...
మరణమ్ముతోనే...
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.