ఇళయరాజా గారి స్వరరచనలో బాలు జానకి గారు ఆడుతూ పాడుతూ గానం చేసిన ఓ చక్కని ప్రేమగీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి
అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
అబ్బనీ తీయనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా
పురుషుల్లోనా పుంగవా పులకింతొస్తే ఆగవా
అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
చిటపట నడుముల ఊపులో ఒక ఇరుసున వరసలు కలవగా
ముసిరిన కసికసి వయసులో ఒక ఎదనస పదనిస కలవగా
కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు
ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు
ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు
చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట
అబ్బనీ తీయనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా
పురుషుల్లోనా పుంగవా పులకింతొస్తే ఆగవా
అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గాఆఁ...
అడగక అడిగినదేవిఁటో లిపి చిలిపిగ ముదిరిన కవితగా
అది విని అదిమిన షోకులో పురి విడిచిన నెమలికి సవతిగా
నిన్నే నావి పెదవులు అవి నేడైనాయి మధువులు
నిన్నే నావి పెదవులు అవి నేడైనాయి మధువులు
రెండున్నాయి తనువులు అవి రేపవ్వాలి మనువులు
వస్తా వలచి వస్తా మనకు ముదిరెను ముచ్చట
వస్తా వలచి వస్తా మనకు ముదిరెను ముచ్చట
అబ్బనీ తీయనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా
పురుషుల్లోనా పుంగవా పులకింతొస్తే ఆగవా
అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.