మంగళవారం, ఫిబ్రవరి 09, 2016

ఏకాంత వేళ...

అన్వేషణ చిత్రం కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఓ చక్కని ప్రేమగీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అన్వేషణ (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ఏకాంత వేళ.. మ్మ్.. 
ఏకాంత సేవ.. మ్మ్..
ఏకాంత వేళ.. కౌగిట్లో
ఏకాంత సేవ.. ముచ్చట్లో
పడుచమ్మ దక్కే.. దుప్పట్లో
దిండల్లె ఉండు.. నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై
ఏకాంత వేళ.. కౌగిట్లో
ఏకాంత సేవ.. ముచ్చట్లో
ఏకాంత వేళా...

ముద్దు సాగిన.. ముచ్చట్లో
పొద్దు వాలదు.. ఇప్పట్లో
ముద్దు సాగిన.. ముచ్చట్లో
పొద్దు వాలదు.. ఇప్పట్లో
కమ్ముకున్న ఈ కౌగిట్లో..
కాటుకంటి.. నా చెక్కిట్లో
నన్ను దాచుకో.. నా ఒంట్లో
పడకు ఎప్పుడూ.. ఏకంట్లో
నన్ను దాచుకో.. నా ఒంట్లో
పడకు ఎప్పుడూ.. ఏకంట్లో
చప్పట్లు.. తిప్పట్లు
నా గుప్పెట్లో

ఏకాంత వేళ.. కౌగిట్లో
ఏకాంత సేవ.. ముచ్చట్లో
పడుచమ్మ దక్కే.. దుప్పట్లో
దిండల్లె ఉండు.. నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై
ఏకాంత వేళ.. కౌగిట్లో
ఏకాంత సేవ.. ముచ్చట్లో
ఏకాంత వేళా...

గుబులు చూపుల.. గుప్పిట్లో
ఎవరు చూడని.. చీకట్లో
గుబులు చూపుల.. గుప్పిట్లో
ఎవరు చూడని.. చీకట్లో
చిక్కబోములే.. ఏకంట్లో
ఎదలు కలుపుకో.. సందిట్లో
దేవుడొచ్చిన.. సందట్లో
ఎదురులేదులే.. ఇప్పట్లో
దేవుడొచ్చిన.. సందట్లో
ఎదురులేదులే.. ఇప్పట్లో
ఆ.. చెక్కిట్లో
రా.. కౌగిట్లో
మ్మ్.. నిద్దట్లో

ఏకాంత వేళ.. కౌగిట్లో
ఏకాంత సేవ.. ముచ్చట్లో
పడుచమ్మ దక్కే.. దుప్పట్లో
దిండల్లె ఉండు.. నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లెపువ్వుల్లొ తావల్లె కన్నుల్లొ ఎన్నెల్లై
ఏకాంత వేళ..


2 comments:

ఏకాంత వేళ దక్కెగ
మాకాంత గుబులు యెదలన మల్లెల మాలన్
ఆకాంక్ష కూడి కౌగిట
ఏకాంగి సరస విరహము నేకాంతమునన్ :)

థాంక్స్ ఫర్ ద నైస్ కామెంట్ జిలేబి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.