ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన ఓ హుషారైన ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : శివ (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి
కన్నెపిల్ల కన్ను గీటితే
చాకులాంటి కుర్రవాడు
బాకులాంటి చూపు గుచ్చి
ఏమిటెప్పుడంటుంటే
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
గాలి మళ్ళుతున్నదీ
పిల్ల జోలికెళ్ళమన్నదీ
లేత లేతగున్నదీ
పిట్ట కూతకొచ్చి ఉన్నదీ
కవ్వించే మిస్సూ కాదన్నా కిస్సూ
నువ్వైతే ప్లస్సూ ఏనాడో యస్సూ
క్లోజప్పులో కొత్త మోజిప్పుడే వింతగా ఉంటే
మోహాలలో పిచ్చి దాహాలతో మత్తుగా ఉంటే
వెన్నెలంటి ఆడపిల్ల
వెన్ను తట్టి రెచ్చగొట్టగా
సరాగమాడే వేళా
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి
కన్నెపిల్ల కన్ను గీటితే
చాకులాంటి కుర్రవాడు
బాకులాంటి చూపు గుచ్చి
ఏమిటెప్పుడంటుంటే
లైఫు బోరుగున్నదీ.
కొత్త టైపు కోరుతున్నదీ
గోల గోలగున్నదీ
ఈడు గోడ దూకమన్నదీ
నువ్వే నా లక్కు నీ మీదే హక్కు
పారేస్తే లుక్కు ఎక్కిందీ కిక్కు
నీ బాణమే కొంటె కోణాలతో మెత్తగా తాకే
నా ఈలకే ఒళ్ళు ఉయ్యాలగా హాయిగా తేలే
సింగమంటి చిన్నవాడు
చీకటింట దీపమెట్టగా
వసంతమాడే వేళా
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి
కన్నెపిల్ల కన్ను గీటితే
చాకులాంటి కుర్రవాడు
బాకులాంటి చూపు గుచ్చి
ఏమిటెప్పుడంటుంటే
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.