బుధవారం, ఫిబ్రవరి 03, 2016

ఓ బంగరు రంగుల చిలకా...

తోటరాముడు చిత్రంలోని ఓ చక్కని ప్రేమగీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : తోట రాముడు (1975)
సంగీతం : సత్యం
గీతరచయిత : వేటూరి
గానం : బాలు, సుశీల

ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ 
నా మీద ప్రేమే ఉందనీ..
నా పైన అలకే లేదనీ

ఓ అల్లరి చూపుల రాజా పలకవా  
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ

 
ఓ.. ఓ.. ఓహో..హో..హో.. 
ఆ.. ఆ.. ఆ.. ఆ..
 
పంజరాన్ని దాటుకునీ
బంధనాలు తెంచుకునీ
నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా
మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో నీ చేతులలో
పులకించేటందుకే

 
ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ 
నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ

సన్నజాజి తీగుంది
తీగ మీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది
జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే
 
ఈ కొండల్లో ఈ కోనల్లో
మనకెదురే లేదులే

ఓ అల్లరి చూపుల రాజా పలకవా  
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ

 

2 comments:

ఇది రాసింది దాశరథి గారు.

థాంక్స్ ఫణీంద్ర గారు సరిచేశాను.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.