ఆదివారం, మార్చి 14, 2021

కోలో కోలన్న కోలో...

టక్ జగదీష్ సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : టక్ జగదీష్ (2021)
సంగీతం : ఎస్.ఎస్.థమన్   
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : అర్మాన్ మాలిక్, హరిణి ఇవటూరి

కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి
ఆరారు ఋతువుల్లోని అక్కర్లేనిది ఏముంది
చూడాలేగాని మన్నే రంగుల పూదోటవుతుంది
తోడై నీవెంట కడదాకా నేనుంటా
రాళ్ళైనా ముళ్ళైనా 
మన అడుగులు పడితే పూలై పొంగాలా

నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే
నిను వెంటాడే దిగులే వెళిపోతుందా 
యమ ధైర్యంగా ఎదురెళ్ళి నిలుచుంటే
నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా

కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి

చినచిన్న ఆనందాలు చినబోని అనుబంధాలు
అపుడపుడూ చెక్కిలిగింతలు పెడుతుండగా
కలతా కన్నీళ్లు లేని చిననాటి కేరింతల్ని
చిటికేసి ఇటురమ్మంటూ పిలిపించగా

కదిలొస్తూ ఉంది చూడు కన్నులవిందుగా
ఊరందర్నీ కలిపే ఉమ్మడి పండుగా
 
హా..! నలుగురితొ చెలిమి పంచుకో
చిరునగవు సిరులు పెంచుకో
జడివానే పడుతున్నా జడిసేనా తడిసేనా
నీ పెదవులపై చిరునవ్వులు ఎపుడైనా

నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే
నిను వెంటాడే దిగులే వెళిపోతుందా
యమ ధీమాగా ఎదురెళ్ళి నిలుచుంటే
నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా

నీలోను నాలోనూ ఈ నేలేగా అమ్మై ఉంది
అంతా అయినోళ్లేగానీ పరులెవ్వరూ
మనలోని చుట్టరికాన్ని మరిపించే ఈ దూరాన్ని
చెరిపే వీలుందంటే కాదనరెవ్వరూ
 
ఒక పువ్వు విచ్చిన గంధం ఊరికే పోదుగా
పదిమందికీ ఆనందం పంచకపోదుగా

ఆ ఆ..! తగిన వరసైన తారక
తెరలు విడి దరికి చేరగా
ప్రతి నిత్యం పున్నమిగా అనుకోదా నెలవంకా
కలలన్నీ విరియగ విరిసిన వెన్నెలగా

నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే
ఓ ఓ..! నిను వెంటాడే దిగులే వెళిపోతుందా
యమ ధర్జాగా ఎదురెళ్ళి నిలుచుంటే
నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా

కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.