శనివారం, మార్చి 20, 2021

ఏ కన్నులూ చూడనీ...

అర్ధశతాబ్దం సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అర్ధశతాబ్దం (2021)
సంగీతం : Nawfal Raja Ais
సాహిత్యం : రెహమాన్ 
గానం : సిధ్ శ్రీరాం

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నదీ నేడు నా ప్రాణమే

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఒకటే క్షణమే చిగురించె ప్రేమనే స్వరం
ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం

అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్నుతాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నదీ నేడు నా ప్రాణమే

ఎంత దాచుకున్నా పొంగిపోతువున్నా
కొత్త ఆశలెన్నో చిన్నిగుండెలోనా
దారికాస్తువున్నా నిన్ను చూస్తువున్నా
నువ్వు చూడగానే దాగిపోతువున్నా
నినుతలచీ ప్రతినిమిషం
పరవశమై పరుగులనే 
తీసే నా మనసు ఓ వెల్లువలా
తన లోలోనా..
 
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్నుతాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నదీ నేడు నా ప్రాణమే
 
రంగులద్దుకున్న సందెపొద్దులాగా
నువ్వునవ్వుతుంటే దివ్వెలెందుకంటా
రెప్పలేయకుండా రెండుకళ్ల నిండా
నిండుపున్నమల్లే నిన్ను నింపుకుంటా
ఎవరికిదీ తెలియదులే
మనసుకిదీ మధురములే
నాలో నే మురిసి ఓ వేకువలా 
వెలుగైవున్నా..!
 
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్నుతాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నదీ నేడు నా ప్రాణమే 


 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.