బుధవారం, మార్చి 24, 2021

ఏ పిలుపిది ఏ పిలుపిది...

మార సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మార (2021)
సంగీతం : జిబ్రాన్   
సాహిత్యం :   
గానం :  

ఏ పిలుపిది ఏ పిలుపిది యే స్వరమిది
చెవిన పలికి మదిని తడిపిన వరమిది
పో పొమ్మను మాటే నోట రాకున్నది
స్వరము వెంట వేలు పట్టి వెళుతున్నది

కలలారని కనుపాపల జో లాలి ఆరారో
ఊపిరి పరవశమై పోయేను ఆరిరో రారో
వాన చినుకు తాకకనె దేహం తడిచే 
మది పుకారు విని షికారుకని నడిచే
 
చేరువరకు గమ్యమెటో తెలిపేదెలా
అంతవరకు అల పాటే ఆపేదెల
చివరి వరకు వినని కథే ముగిసేదెలా
వెతికి తెలుసుకోకుంటే రాసేదెలా

ఎద ఊయల ఒడిలో కలలే 
తెలుపు మలుపు
నీ శ్రమ సాధించెను గెలుపు
ఆ గెలుపు వేల నిధులే 
చిరుగాలి పలికే శుభా కాంక్షలే

ఏ పిలుపిది ఏ పిలుపిది యే స్వరమిది
చెవిన పలికి మదిని తడిపిన వరమిది
పో పొమ్మను మాటె నోట రాకున్నది
స్వరము వెంట వేలు పట్టి వెళుతున్నది
 
    

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.