శుక్రవారం, మార్చి 19, 2021

ఎందరో మోసిన సుందర...

చావు కబురు చల్లగా సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : చావుకబురు చల్లగా (2021)
సంగీతం : జేక్స్ బిజోయ్
సాహిత్యం : సనారే 
గానం : దీపిక.వి. 

ఎందరో మోసిన సుందర భావము
సుగుణభిరాముని సొంతమయే
సంబర వీధిన ఆతని హృదయము
చలముతో తకధిమి నాట్యమయే

కన్నుల ముందర దేవత రూపము
చూసెడి భాగ్యము దొరికినదీ
తప్పని తెలుపుతు దైవము దిగిన
ఆపితే ఆగని వరుస ఇదీ
 
ఎందరో మోసిన సుందర భావము
సుగుణభిరాముని సొంతమయే

అధరాల ఎరుపుకి నీరాజనం
జలజాక్షి మోముకి నీరాజనం
అధరాల ఎరుపుకి నీరాజనం
జలజాక్షి మోముకి నీరాజనం
అలివేణి తురుముకి అపురూప సొగసుకి
అలివేణి తురుముకి అపురూప సొగసుకి
హృదయాంతరము నుండి 
నీరాజనం ప్రేమ నీరాజనం

ఎందరో మోసిన సుందర భావము
సుగుణభిరాముని సొంతమయే

మకుటము లేని ఏలికసాని
మనసుని కదిపిన మోక్ష ప్రదాయని
వదనము చూడగ మాటే రాని
గారడమున్నద నయనములోని
అడగక నే మది సుమధుర రమణిని
చూపిన క్షణమున వదిలా తనువుని 
కలిసా వలుపుని

ఎందరో మోసిన సుందర భావము
సుగుణభిరాముని సొంతమయే
సంబర వీధిన ఆతని హృదయము
చలముతో తకధిమి నాట్యమయే
కన్నుల ముందర దేవత రూపము
చూసెడి భాగ్యము దొరికినదీ
తప్పని తెలుపుతు దైవము దిగిన
ఆపితే ఆగని వరుస ఇదీ
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.