కొన్ని పాటలు చూడడానికన్నా ముందే బాగా వినడానికి అలవాటుపడిపోతాము దాంతో ఆ పాట గురించి మన మనసులో ఒక ఊహా చిత్రం ఏర్పడిపోతుంది. ఈ పాట గురించి కూడా నాకు అలాంటి ఒక అందమైన ఊహా చిత్రమే మనసులో ముద్రించుకుపోయింది. చిన్నపుడు సినిమా మొదటిసారి చూసినపుడు ఈ పాట గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ తరువాత తరువాత ఈపాట వినేకొద్ది చాలా నచ్చేసింది అలాగే తెరమీద అప్పుడేం చూశానో గుర్తులేకుండా నా ఊహలు మాత్రమే మిగిలిపోయాయి.
ఇంత ఉపోధ్ఘాతమెందుకు చెప్పానంటే ఈ పాట చూడడం కన్నా కనులు మూసుకుని వినడం నాకు చాలా ఇష్టం. అలా ఎన్నిసార్లు రిపీటెడ్ గా విన్నానో లెక్కలేదు. సిరివెన్నెల గారు రాసిన ఈ పాట సాహిత్యం చాలా అందంగా ఉంటుంది. ఇళయరాజా గారి బాణి గోదారి మీద చల్లని గాలుల్లో పడవ ప్రయాణంలా సుతిమెత్తగా హాయిగా సాగుతుంది. ప్రారంభమే పక్షుల కిల కిలా రావాలతో చాలా చక్కగా ప్రారంభమవుతుంది, మొదటి చరణం ముందు వచ్చే ఫ్లూట్ బిట్ కూడా భలే ఉంటుంది.
స్వాతిముత్యం సినిమాలో నేపధ్యసంగీతంలో ఊపయోగించిన ఒక మ్యూజిక్ బిట్ వంశీ గారికి బాగా నచ్చి అదే ట్యూన్ లో కావాలని చెప్పి మరీ ఇళయరాజా గారితో ఈ పాటకి ట్యూన్ చేయించుకున్నారట. బాలు గారి గొంతు కాస్త జలుబు చేసినట్లు అనిపిస్తుంది కానీ అదే అందంగా ఉంటుంది ఇక జానకి గారు ఎప్పటిలాగే పాట మూడ్ కి తగ్గట్లు బ్రహ్మాండంగా పాడారు.
ఈ చక్కని పాట ఆడియో మాత్రం వినాలంటే రాగాలో ఇక్కడ వినవచ్చు వీడియో కూడా చూడాలంటే ఇక్కడ చూడవచ్చు. ఈ పాటంటే అమితమైన ఇష్టంగల నా ఆత్మీయ మిత్రుడు.. ఇళయరాజా కి భక్తుడు, వంశీకి వీరాభిమాని కూడా... ఈ వారాంతంలో తన పెళ్ళి సంధర్బంగా ఈ టపా తనకి అంకితం.
చిత్రం: శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
సంగీతం : ఇళయరాజ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి
ఏనాడు విడిపోని ముడి వేసెనే
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
ఈ మధుర యామినిని
ఏ జన్మ స్వప్నాల అనురాగమో
ఏ జన్మ స్వప్నాల అనురాగమో
పూసినది నేడు ఈ పసుపు తాడు
పూసినది నేడు ఈ పసుపు తాడు
ఈ సుధల ఆమనిని
ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే
సంగీతం : ఇళయరాజ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి
ఏనాడు విడిపోని ముడి వేసెనే
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
ఈ మధుర యామినిని
ఏ జన్మ స్వప్నాల అనురాగమో
ఏ జన్మ స్వప్నాల అనురాగమో
పూసినది నేడు ఈ పసుపు తాడు
పూసినది నేడు ఈ పసుపు తాడు
ఈ సుధల ఆమనిని
ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే
సా...గామ గమ గామ గమరీ..
సారి నిరి సారి నిసనీ..
సాదాదరీ.. రీగాగపా..
మోహాన పారాడు వేలి కొనలో
నీ మేను కాదా చైత్ర వీణ
వేవేల స్వప్నాల వేడుకలలో
నీ చూపు కాదా పూల వాన
రాగసుధ పారే అలల శ్రుతిలో
స్వాగతము పాడే ప్రణయము
కలకాలమూ కలగానమై
నిలవాలి మన కోసము... ఈ మమత
ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే
నీ మోవి మౌనాన మదన రాగం
మోహాన సాగే మధుప గానం
నీ మోవి పూసింది చైత్ర మోదం
చిగురాకు తీసే వేణు నాదం
పాపలుగ వెలిసే పసిడి కలకు
ఊయలను వేసే క్షణమిదే
రేపన్నదీ ఈ పూటనే
చేరింది మన జంటకు... ముచ్చటగ
ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
పూసినది నేడు ఈ పసుపు తాడు
ఈ మధుర యామినిని
ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే
5 comments:
వెన్నెల్లొ హాయ్ హాయ్..మల్లెల్లొ హాయ్ హాయ్..వరాల జల్లే కురిసే..థాంక్యు వేణూజి..
తెలుగు ప్రాక్టీస్ మొదలెట్టేశారనమాట థాంక్స్ శాంతిగారు :-)
venuji.. name/url option is not given in your movie review page..
వేణూజీ..మీ మూవీ రివ్యు పేజ్ లో వున్న ప్రొఫైల్ ఆప్షన్స్-గూగుల్,లైవ్ జర్నల్ etc కంటే..పాటతో నేను " పేజ్ లో-పేరు/url & అజ్ఞాత అనే ఆప్షన్స్ కామెంట్ పోస్ట్ చేయడానికి చాలా వీజీగా ఉన్నాయండీ..
అపరిచితులు అసంధర్బమైన కామెంట్స్ తో విసిగిస్తున్నారని ఆ బ్లాగ్ లో అలా యూజర్ ఐడి మాండేటరీ అని ఆప్షన్స్ పరిమితం చేశాను శాంతి గారు. ఇపుడు ఈ బ్లాగ్ లాగానే మార్చాను చూడండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.