సోమవారం, సెప్టెంబర్ 02, 2013

నేనేనా ఆ నేనేనా...

కళ్యాణికోడూరి(కళ్యాణిమాలిక్) కంపొజిషన్ నాకు చాలా నచ్చుతుంది. నా మిత్రులలో కొందరు తనవన్నీ మెలోడీస్ ఆల్మోస్ట్ అన్ని పాటలు ఒకేలాగా ఉంటాయ్ అని కంప్లైంట్ చేసినవాళ్లు కూడా లేకపోలేదు. కానీ నాకు మాత్రం తన పాటలు వేటికవే స్లైట్ వేరియేషన్ తో ఎక్కువకాలం గుర్తుండిపోయేలా ఉంటాయ్ అని అనిపిస్తుంటుంది. "అంతకుముందు ఆ తరువాత" సినిమా కోసం తను కంపోజ్ చేసిన ఈ "నేనేనా ఆ నేనేనా" అనే పాట కూడా అలాగే నాకు చాలా నచ్చేసింది. ఈపాట ప్రారంభంలో వచ్చే మ్యూజిక్ బిట్ చాలాబాగుంది. సిరివెన్నెల గారి సింపుల్ సాహిత్యం సినిమాలోని సన్నివేశాన్ని పాత్రల మనోభావాల్ని సున్నితంగా మన కళ్ళముందు పెడుతుంది. ఈమెలోడికి శ్రీకృష్ణ సునీతల స్వరం చక్కగా అమరింది. పూర్తిపాట ఆడియో లింక్ దొరకలేదు మీకెవరికన్నా తెలిస్తే కామెంట్స్ లో ఇవ్వగలరు. యూట్యూబ్ లో పూర్తిపాట ఇక్కడ వినవచ్చు. సిరివెన్నెల గారి చేతిరాతలో ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూస్తూ పాట వినవచ్చు.


 
చిత్రం : అంతకుముందు ఆతరువాత
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : కళ్యాణి కోడూరి(కళ్యాణిమాలిక్)
గానం : శ్రీకృష్ణ, సునీత

నేనేనా ఆ నేనేనా!
నా నుంచి నేనే వేరయ్యానా!!
ఉన్నానా నేనున్నానా!
ఉన్నానుగా అంటున్నానా!!
వెళ్ళొస్తానంటూ ఆ నిజం
ఓ జ్ఞాపకంలా మారిపోతున్నా
ఏం చేశాననీ ఏం చూస్తున్నాననీ
అనుకోని ఆ క్షణం.
నేనేనా ఆ నేనేనా!
నా నుంచి నేనే వేరయ్యానా!!

గాలిలో మేడ గాల్లోనే ఉంటుంది
నేలకేనాడు దిగిరాదనీ.
నీటిలో నీడ నీళ్ళల్లో కరిగింది
చేతికందేది కాదే అనీ
చెప్పాలా ఎవరో కొత్తగా
అది నమ్మలేనీ వింతకాదనీ
ఏం చేశాననీ ఏం చూస్తున్నాననీ
అనుకోని ఆ క్షణం
నేనేనా ఆ నేనేనా!
నా నుంచి నేనే వేరయ్యానా!!

ఆఅ.ఆఆఆఆఆఆఆఆ...

నన్ను నాలాగ చూపించవే అంటూ
నిలువుటద్దాన్ని నిందించనా
నేను తనలాగ ఏనాడు మారానో
నాకు నేనింక కనిపించనా
అద్దంలో లోపం లేదనీ
నా చూపులోనే శూన్యముందనీ
ఏం చేశాననీ ఏం చూస్తున్నాననీ
అనుకోని ఆ క్షణం
నేనేనా ఆ నేనేనా!
నా నుంచి నేనే వేరయ్యానా!!

10 comments:

నాకూ ఈ పాటతో పాటు సాహిత్యం కూడా అంతే నచ్చింది .

థాంక్స్ రాధిక గారు, అవునండీ ట్యూన్ సాహిత్యం రెండూ బాగున్నాయ్.

నాక్కూడా నచ్చిందీ పాట.. ఓ రెండ్రోజులు దీని సాయంతోనే నిద్రపోయా కూడా! :))
చాలా రోజుల తర్వాత సునీత సాంగ్ ఒకటి బావుంది. (అభిమానులూ, నో హార్డ్ ఫీలింగ్స్ ప్లీజ్! :)) )

>ఓ రెండ్రోజులు దీని సాయంతోనే నిద్రపోయా కూడా! :))< బింగో నిషీ.. నేనుకూడా :-) అభిమానులకు ఇచ్చిన నోట్ బాగుంది :-)) థాంక్స్ ఫర్ ద కామెంట్.

How did I miss this post from you ? That's a real beautiful song. It's been few weeks since I made this number as my bed time song. Liked Sunitha's voice for the first time. And Srikrishna did a good job in presenting it melodiously. The full audio song with lyrics written by Sirivennela garu in his own hand writing (video is not available yet) can be found below. I liked the experiment of bringing all the songs from this movie in front of audience with the lyricists' hand writing.

Siddharth

http://www.youtube.com/watch?v=n2U1tyjCzxQ

By the way, are you sure that Kalyani Koduri and Kalyani Malik are the same ? Because I have heard to Kalyani Malik's voice before which is different from the voice of three songs from this movie which were sung by Kalyani Koduri.

Siddharth

సాహిత్యం : అనంత్ శ్రీరాం

Please correct this.

Siddharth

థాంక్స్ ఎ లాట్ సిద్దార్థ్ గారు.. ఫర్ ద కామెంట్, వీడియో, అండ్ కరెక్షన్. పోస్ట్ అప్డేట్ చేశాను. అప్పట్లో కన్ఫూజ్ అవుతూనే వీళ్ళ ఇంటర్వ్యూ ఏదో చూసి లెక్కేసి రాశాను కానీ పొరపడినట్లున్నాను. నిజమేనండీ ఆ లిరిక్స్ వీడియో క్లాసిక్ ఐడియా, కానీ నాకు అప్పట్లో మూడు పాటలే దొరికాయి ఇది దొరకలేదు. కళ్యాణిమాలిక్ అండ్ కళ్యాణి కోడూరి ఒక్కరేనండి అది మాత్రం ష్యూర్ :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.