శుక్రవారం, సెప్టెంబర్ 13, 2013

ఇంతకూ నువ్వెవరూ !!

సినీ ప్రపంచంలో ఒకోసారి కొత్తవాళ్ళు భలే మెరిపిస్తారు, దదాపు అందరూ కొత్తవాళ్ళే పని చేసిన “స్నేహితుడా” సినిమా లోని ఈ పాట అలాంటి వాటిలో ఒకటి. ఈ సినిమా పూర్తిగా చూసే అవకాశం నాకు ఇప్పటివరకూ దొరకలేదు కానీ ఈ పాటమాత్రం కొన్ని వందల సార్లు విన్నాను. సంగీత దర్శకులు, పాటల రచయిత సినిమా దర్శకుడు అంతా కొత్తవాళ్ళే అయినా శ్రేయఘోషల్ ఈ పాటకి ప్రాణం పోసింది. మీరూ ఓ సారి వినండి. ఆడియో మాత్రమే వినాలంటే రాగాలో ఇక్కడ వినవచ్చు. వీడియో ఈ క్రింద చూడగలరు.


చిత్రం : స్నేహితుడా
సంగీతం : శివరామ్ శంకర్
సాహిత్యం : భాషాశ్రీ
గానం : శ్రేయా ఘోషల్

Who who who who are you
Who who who who are you

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఇంతకూ ముందెవరూ ఇంతగా నాకెవరూ
చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ ఏ బంధము మనది అని
నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఆఆఆఆఆ.అ.అ.అ.ఆఆఆఆఅ

ఎందుకో ఏమిటో నేను చెప్పలేను గానీ
కలిసావు తియ్యనైన వేళ
చనువుతో చిలిపిగా నీవే మసలుతుంటే నాతో
మరిచాను గుండెలోని జ్వాలా
ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది
నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నదీ

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఎవరనీ చూడక నాకై పరుగు తీస్తూ ఉంటే
నీ తీరే ఆశ రేపె నాలో
నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే
చూసాలే నన్ను నేను నీలో
ప్రియమైన సమయమా గమనమా చెప్పవే అతనికి
ఈ చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందనీ

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ ఏ బంధము మనది అని
నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ

5 comments:

ఈ మూవీ చాలా సార్లు టి వి లో వచ్చింది వేణూజీ..మిస్ ఐనా ఫరవాలేదు..బట్ ఈ సాంగ్ మాత్రం యెక్కడో మనసుని హాంట్ చేసేలా వుంటుంది..శ్రేయ వాయిస్ లో వున్న మాజిక్ వల్లేమో..వీలైతే రిధం లో "తం తన నం-కదిలే అలవో"..సాంగ్ పై మీ స్టైల్లో ఒపీనియన్ రాస్తే చదవాలని వుంది..ఆ పాటా పేరు తెలీని అనుబంధం గురించి పాడేదే..

శ్రేయ ఘోషల్ పాటకి ప్ర్రాణం పోసింది :-)

థాంక్స్ శాంతి గారు, ఈ సినిమా టీవీలో రావడం గమనించాను కానీ ఎపుడూ చూసే అవకాశం దొరకలేదండీ. రిథమ్ పాటలన్నీ బాగుంటాయి. మీరు చెప్పిన పాట లిరిక్స్ అందివ్వడానికి ప్రయత్నిస్తాను.

Thanks for reiterating Sravya :-))

ee cinemaki music director kotta kadu atanu already "priyamaina neeku" cinemaki chesadu

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.