గురువారం, మార్చి 18, 2021

కంటిపాపా కంటిపాపా...

వకీల్ సాబ్ సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : వకీల్ సాబ్ (2021)
సంగీతం : ఎస్.ఎస్.థమన్ 
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి 
గానం : అర్మాన్ మాలిక్, దీపు, థమన్ 

కంటిపాపా కంటిపాపా చెప్పనైన లేదే
నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా
కాలి మువ్వా కాలి మువ్వా సవ్వడైన లేదే
నువ్విన్నినాళ్ళుగా వెంట తిరుగుతున్నా

నీరాక ఏరువాక నీ చూపే ప్రేమలేఖ
నీలో నువ్వాగిపోకా కలిసావే కాంతి రేఖ
అంతులేని ప్రేమ నువ్వై ఇంత దూరం వచ్చినాక
అందమైనా భారమంతా నాకు పంచినాకా

మొదలేగా కొత్తకొత్త కథలు
మొదలేగా కొత్తకొత్త కలలు
ఇకపైనా నువ్వు నేను బదులు
మనమన్నా కొత్తమాట మొదలు

కంటిపాపా కంటిపాపా చెప్పనైన లేదే
నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా

సాపమాప మాప మాగసామగరిసా
సాపమాప మాప మాగసామగరిసా

సుదతీ సుమలోచనీ సుమనోహర హాసిని
రమణీ ప్రియ భాషిణీ కరుణాగుణ భాసిని
మనసైన వాడిని మనువాడిన ఆమని
బదులీయవే చెలీ నువు పొందిన ప్రేమనీ
పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా

సాపమాప మాప మాగసామగరిసా
సాపమాప మాప మాగసామగరిసా

ఎదలో ఏకాంతము ఏమయ్యిందో ఏమిటో
ఇదిగో నీ రాకతో వెళిపోయింది ఎటో
నాలో మరో నన్ను చూశా నీకో స్నేహితుణ్ని చేశా
కాలం కాగితాలపై జంట పేర్లుగా నిన్ను నన్ను రాసా

ఆకాశం గొడుగు నీడ పుడమేగా పూల మేడ
ఏ చూపులు వాలకుండా ప్రేమే మన కోటగోడ
నాకు నువ్వై నీకు నేనై ఏ క్షణాన్నీ వదలకుండా
గురుతులెన్నో పెంచుకుందాం గుండె చోటు నిండా

మొదలేగా కొత్తకొత్త కథలు
మొదలేగా కొత్తకొత్త కలలు
ఇకపైనా నువ్వు నేను బదులు
మనమన్నా కొత్తమాట మొదలు 

మొదలేగా కొత్తకొత్త కథలు
మొదలేగా కొత్తకొత్త కలలు
ఇకపైనా నువ్వు నేను బదులు
మనమన్నా కొత్తమాట మొదలు 


  

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.