శనివారం, మార్చి 06, 2021

కోలు కోలో కోలోయమ్మ...

విరాటపర్వం సినిమాలోని ఓ అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : విరాటపర్వం (2021)
సంగీతం : సురేష్ బొబ్బిలి   
సాహిత్యం : చంద్రబోస్ 
గానం : దివ్య మాలిక, సురేష్ బొబ్బిలి

కోలు కోలో కోలోయమ్మ 
కొమ్మ చివరనా పూలూ పూసే కోలో 
పూవులాంటి సిన్నదేమో 
మొగ్గయ్యింది సిగ్గుతోటి కోలో..యమ్మా 

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి 
మనసే మేలుకొని చూసే 
కలలో నిండిన వాడే 
కనుల ముందర ఉంటే 
నూరేళ్లు నిదుర రాదు లే

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి 
మనసే మేలుకొని చూసే 
కలలో నిండిన వాడే 
కనుల ముందర ఉంటే 
నూరేళ్లు నిదుర రాదు లే

ఏ పిల్లగాడి మాటలన్నీ 
గాజులల్లే మార్చుకుంట
కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా
కుర్రగాడి చూపులన్నీ 
కొప్పులోను ముడుచుకుంటా 
అల్లరంత నల్లపూసలంటా
వాడి గూర్చీ ఆలోచనే 
వాడి పోనీ ఆరాధనే 
తాళి లాగ మెళ్ళో వాలదా 

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి 
మనసే మేలుకొని చూసే 
కలలో నిండిన వాడే 
కనుల ముందర ఉంటే 
నూరేళ్లు నిదుర రాదు లే
 
పాదమేమో వాడిదంట 
పయనమేమో నాది అంట 
వాడి పెదవితోటి నవ్వుతుంటా 
అక్షరాలు వాడివంట 
అర్థమంతా నేను అంటా 
వాడి గొంతుతోటి పలుకుతుంటా 
ప్రాణమంతా వాడేనంటా 
ప్రాయమంతా వాడేనంటా
వాడి ప్రేమై నేనే బ్రతకనా 

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి 
మనసే మేలుకొని చూసే 
కలలో నిండిన వాడే 
కనుల ముందర ఉంటే 
నూరేళ్లు నిదుర రాదు లే
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.