జర్నీ చిత్రంలోని ఒక అందమైన ప్రేమగీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : జర్నీ (2011)
సంగీతం : సత్య
రచన : సాహితి
గానం : సత్య, హరిణి
చిట్టి చిట్టి పులకింత
చిత్రం గా తనువంతా
చేసావు నాలో గోరంత గిలిగింత
వుంటే నువ్వు నా చెంత జన్మంతా కేరింతా
రేపావు యదలో కొండంత కవ్వింతా
నీ జతే కలిసేనా యిక నా యదకే
కలుగును పరవసమంతా
నువ్వు ఏవో ఏవో వర్ణాలనే నింపావు నా కంటి లో
కళ్ళు తెరిచేలోగా వలపై ఇలా నిండావు నా గుండెలో
మన రేపటి పయనం మహా సుందర స్వప్నం
ఓ వేల్లువల్లె నాలో ప్రేమే పొంగి పోయెనే
తోలి కన్నె సిగ్గు సందెవేళ పున్నమాఎలె
హాయిలే లోకమే హాయిలే
ఆ దైవం అరెరే మా హృదయమే మైనం తో చేసాడులే
ఆ మైనం మగువను చూడంగానే కరిగించి వేసాడులే
ఈ మౌన సరాగం మన ఇరువురి సొంతం
నీ శ్వాస ధ్యాస నన్నే తాకి చుట్టమాయేనే
నీ అందమైన జ్ఞాపకాలు చుట్టూ మూగేలే
మూగేనే మువ్వలై మోగేనే
చిట్టి చిట్టి పులకింత చిత్రం గా తనువంతా
చేసావు నాలో గోరంత గిలిగింత
2 comments:
ఈ పాట చూసి మూవీ కి వెళ్ళానండీ..బట్ అ యెండింగ్, ముఖ్యం గా యాక్సిడెంట్ ఐన రోడ్ పై కొత్త లేయర్స్ వచ్చేసి, అట్టడుగున మిగిలిన ఙాపకాలని కమ్మేస్తూ..మనసు మామూలవడానికి సమయం పట్టింది..
అవునండీ ఈ సినిమా కూడా చాల డిఫరెంట్ గా ఉంటుంది.. హార్ష్ రియాలిటీస్ చూపించేస్తాడు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.