శుక్రవారం, అక్టోబర్ 09, 2015

జాబిలితో చెప్పనా..

వేటగాడు సినిమాలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : వేటగాడు (1979)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల 

జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా..
జామురాతిరి నిదురలోన
నీవు చేసిన అల్లరి చెప్పనా... రోజా

జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా ..
జామురాతిరి కలలలోన
నీవు రేపిన అలజడి చెప్పనా.. రాజా

తుమ్మెదలంటని తేనెలకై.. తుంటరి పెదవికి దాహాలు
చుక్కలు చూడని చీకటిలో.. సిగ్గులు కలవని విరహాలు
తుమ్మెదలంటని తేనెలకై.. తుంటరి పెదవికి దాహాలు
చుక్కలు చూడని చీకటిలో.. సిగ్గులు కలవని విరహాలు
చూపులలో చలి చురచురలూ.. ఆచలి తీరని విరవిరలూ
అన్ని ఆవిరి పెడుతుంటే.. నన్నే అల్లరి పెడుతున్నావని
చెప్పనా .. ఆ .. చెప్పనా.. ఆ .. చెప్పనా

జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా..
జామురాతిరి నిదురలోన
నీవు చేసిన అల్లరి చెప్పనా... రోజా

జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా ..
జామురాతిరి కలలలోన
నీవు రేపిన అలజడి చెప్పనా.. రాజా

గొంతులు దాచిన గుండెలలో.. కోయిల పాడని గీతాలు
సూర్యుడు చూడని గంగలలో.. అలలై పొంగిన అందాలు
గొంతులు దాచిన గుండెలలో.. కోయిల పాడని గీతాలు
సూర్యుడు చూడనని గంగలలో.. అలలై పొంగిన అందాలు
కౌగిట కాముని పున్నములు.. వెన్నెల వీణల సరిగమలు
పేరంటానికి రమ్మంటే.. పెళ్ళికి పెద్దవు నీవేలెమ్మని
చెప్పనా .. .. చెప్పనా .. ఆ .. చెప్పనా

జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా
జామురాతిరి కలలలోన
నీవు రేపిన అలజడి చెప్పనా.. రాజా

జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా
జామురాతిరి నిదురలోన
నీవు చేసిన అల్లరి చెప్పనా.. రోజా

రోజా.. రాజా.. రోజా.. రాజా
రోజా.. రాజా.. రోజా.. రాజా


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.