శుక్రవారం, అక్టోబర్ 16, 2015

వరమహాలక్ష్మీ కరుణించవమ్మా...

ఈ రోజు అమ్మవారిని శ్రీమహాలక్ష్మి అలంకరణలో అర్చించుకుంటూ వరలక్ష్మీ వ్రతం చిత్రం లోని ఈ చక్కని పాటను తలచుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : వరలక్ష్మీ వ్రతం (1971)
సంగీతం : రాజన్ నాగేంద్ర
సాహిత్యం : జి.కృష్ణమూర్తి
గానం : జానకి, లీల, పి.బి.శ్రీనివాస్ బృందం

వరమహాలక్ష్మీ కరుణించవమ్మా
వరమహాలక్ష్మీ కరుణించవమ్మా
చరణాలే శరణంటినమ్మా…
పతిదేవు బాసితి వెతలంది రోసితి
నుతియింతు పతినీయవమ్మా
వరమహాలక్ష్మీ వరమీయవమ్మా


మాం పాహి మాతా… మాం పాహి మాతా…
మాం పాహి మాం పాహి మాం పాహి మాతా

పాలకడలిన పుట్టి శ్రీహరిని చేపట్టి
వైకుంఠలోకాన లక్ష్మివైనావే
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
సత్వగుణమూర్తివే ఆ… సంపత్స్వరూపివే ఆ…
సత్వగుణమూర్తివే… సంపత్స్వరూపివే…
సర్వసిద్ధివి నీవే సుమ్మా
 
నావేదనను బాప నీ దేవుతో గూడి
నైవేద్యమందుకోవమ్మా 
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
మాం పాహి మాం పాహి మాం పాహి మాతా


వాగీశు రాణివై వరవీణపాణివై
బ్రహ్మలోకమ్మున వాణివైనావే
మాం పాహి మాతా… మాం పాహి మాతా… 

కల్యాణదాయిని కళల స్వరూపిణి
ఇల సకల విద్యలకు తల్లివీవమ్మా

నావేదనను బాప నీ దేవుతో గూడి
నైవేద్యమందుకోవమ్మా 
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
మాం పాహి మాం పాహి మాం పాహి మాతా
గిరిరాజ తనయవై పరమేశు తరుణివై
కైలాసలోకాన గౌరివైనావే
మాం పాహి మాతా… మాం పాహి మాతా… 

శక్తిస్వరూపిణి మాం పాహి మాతా
భక్తజనపాలిని మాం పాహి మాతా
భక్తజనపాలిని మాం పాహి మాతా
సుఖసౌఖ్య సౌభాగ్యదాయివీవమ్మా

నావేదనను బాప నీ దేవుతో గూడి
నైవేద్యమందుకోవమ్మా 
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
మాం పాహి మాం పాహి మాం పాహి మాతా
పతినీయవమ్మా…
పతినీయవమ్మా…
పతినీయవమ్మా…


2 comments:

దుర్గామ్మవారిని అష్టలక్ష్మీ స్వరూపిణిగా చూసుకో గలిగేది , అలంకరించేది..ఈ నవరాత్రి మహ పర్వ దినాలలోనే కదా..

అవును శాంతి గారు, థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.