శనివారం, అక్టోబర్ 17, 2015

జననీ శివకామినీ...

ఈ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకరణలో అర్చించుకుంటూ నర్తనశాల చిత్రం లోని ఈ చక్కని పాటను తలచుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నర్తనశాల (1963)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం : సముద్రాల సీనియర్
గానం : సుశీల

జననీ శివకామినీ
జయశుభకారిణి విజయరూపిణీ
జననీ శివకామినీ
జయశుభకారిణి విజయరూపిణీ
జననీ శివకామినీ

అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్న అమ్మవు నీవే 
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్న అమ్మవు నీవే 
నీ చరణములే నమ్మితినమ్మా
నీ చరణములే నమ్మితినమ్మా
శరణము కోరితి అమ్మా భవానీ

జననీ శివకామినీ
జయశుభకారిణి విజయరూపిణీ
జననీ శివకామినీ

నీ దరినున్న తొలగు భయాలు
నీ దయలున్న కలుగు జయాలు
నీ దరినున్న తొలగు భయాలు
నీ దయలున్న కలుగు జయాలు
నిరతము మాకు నీడగ నిలచీ
నిరతము మాకు నీడగ నిలచీ
జయము నీయవే అమ్మా
జయము నీయవే అమ్మా భవానీ

జననీ శివకామినీ
జయశుభకారిణి విజయరూపిణీ
జననీ శివకామినీ


2 comments:

యెంతో ఆర్తి నిండిన పాట..మనసంతా నెమ్మదైన ప్రశాంతత తో నిండి పోతుందండీ ఈ పాట వింటుంటే..

అవును శాంతి గారు నిజమే.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.