దానవీరశూరకర్ణ చిత్రంలో ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : దాన వీర శూర కర్ణ (1977)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల
చిత్రం..హాయ్ భళారే విచిత్రం..
చిత్రం..అయ్యారే విచిత్రం
నీ రాచనగరకు రారాజును రప్పించుటే విచిత్రం
పిలువకనే ప్రియవిభుడే విచ్చేయుటేవి చిత్రం
చిత్రం.. అయ్యారే విచిత్రం
హ..హ..చిత్రం..హాయ్ భళారే విచిత్రం.
రాచరికపు జిత్తులతో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
రణతంత్రపుటెత్తులతో..ఓ..ఓహో..ఓ..ఓ..ఓ..ఓ
రాచరికపు జిత్తులతో..రణతంత్రపుటెత్తులతో
సతమతమవు మా మదిలో..
మదనుడు సందడి సేయుట సిత్రం
ఆయ్ భళారే విచిత్రం..
ఎంతటి మహరాజయినా..ఆ హా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఎంతటి మహరాజయినా..ఎప్పుడో ఏకాంతంలో
ఎంతో కొంత తన కాంతను..స్మరించుటే సృష్టిలోని చిత్రం
హాయ్ భళారే విచిత్రం.. అయ్యారే విచిత్రం
బింభాధర మధురిమలూ..ఊ..ఊ..ఊ
బిగికౌగిలి ఘుమఘమలూ..ఊ..ఊ..ఆ..ఆ..ఆఅ..ఆ
బింభాధర మధురిమలు..బిగికౌగిలి ఘుమఘుమలు
ఇన్నాళ్ళుగా మాయురే.. మేమెరుగకపోవుటే..
చిత్రం.. హాయ్ భళారే విచిత్రం..
ఆ..ఆ..ఆఅ..హా..హా..హ..హ..ఆ..ఆ..ఆ
వలపెరుగని వాడననీ..ఈ..ఈ..ఈ..ఈ
వలపెరుగని వాడననీ..పలికిన ఈ రసికమణి
తొలిసారే ఇన్ని కళలు కురిపించుట.. హవ్వా
నమ్మలేని చిత్రం..మ్..అయ్యారే విచిత్రం..
హాయ్ భళారే విచిత్రం..
అయ్యారే విచిత్రం..అయ్యారే విచిత్రం..
అయ్యారే విచిత్రం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.