శనివారం, అక్టోబర్ 03, 2015

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం..

చక్రవర్తి గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జస్టిస్ చౌదరి (1982)
రచన : వేటూరి,
సంగీతం : చక్రవర్తి
గానం : బాలు, సుశీల, శైలజ

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
చిగురులేసే సిగ్గు చీనాంబరాలు
తడిసి కురిసే కళ్లు నీ తలంబ్రాలు

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
 
కనుబొమ్మల నడుమ విరిగింది శివధనుసు
కన్నుల్లో మెరిసింది కన్నె సీత మనసు
కనుబొమ్మల నడుమ విరిగింది శివధనుసు
కన్నుల్లో మెరిసింది కన్నె సీత మనసు
ఆ రామచంద్రుడు నెలవంకలిస్తాడని
ఆ రామచంద్రుడు నెలవంకలిస్తాడని
పొడిచింది ఓ చుక్క బుగ్గలో ఇప్పుడు
అందాలకెందుకు గంధాల పూతలు
అందాలకెందుకు గంధాల పూతలు
కళ్లకే వెలుతురు మా పెళ్లికూతురు
ఈ పెళ్లికూతురు...

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
 
అడగలేదు అమ్మనైనా ఏనాడు ఆకలని
అలుసు చేయవద్దు మీరు తానేమి అడగదని
ఆడగబోదు సిరిసంపదలు ఏనాడూ పెనిమిటిని
అడిగేదొక ప్రేమ అనే పెన్నిధిని
చెప్పలేని మూగబాధ చెప్పకనే తెలుసుకో
మాటలకే అందని మనసు.. 
చూపులతో తెలుసుకో..
రెప్పవలే కాచుకో..

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
చిగురులేసే సిగ్గు చీనాంబరాలు
తడిసి కురిసే కళ్లు నీ తలంబ్రాలు

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం 



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.