బుధవారం, అక్టోబర్ 07, 2015

నువ్వేనా.. నా నువ్వేనా...

కె.యమ్.రాధాకృష్ణన్ గారి సంగీతంలో వచ్చిన ఆనంద్ చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆనంద్ (2004)
సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్
సాహిత్యం : వేటూరి సుందర రామమూర్తి
గానం : కె.ఎం.రాధాకృష్ణన్, శ్రేయా ఘోషల్

నువ్వేనా... నా నువ్వేనా
నువ్వేనా... నాకు నువ్వేనా
సూర్యుడల్లే సూదిగుచ్చి సుప్రభాతమేనా
మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆ... ఆనందమేనా... ఆనందమేనా...
 
నువ్వేనా... నా నువ్వేనా
నువ్వేనా... నాకు నువ్వేనా

మేఘమల్లే సాగివచ్చి దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు
కలలేనా... కన్నీరేనా...
ఆ... తేనెటీగ లాగ కుట్టి తీపిమంట రేపుతావు
పువ్వులాంటి గుండెలోన దారమల్లే దాగుతావు
నేనేనా... నీ రూపేనా...

చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆ... ఆనందమేనా... ఆనందమేనా...
నువ్వేనా... నా నువ్వేనా
నువ్వేనా... నాకు నువ్వేనా

ఆ... కోయిలల్లే వచ్చి ఏదో కొత్తపాట నేర్పుతావు
కొమ్మగొంతులోన గుండె కొట్టుకుంటె నవ్వుతావు
ఏ రాగం... ఇది ఏ తాళం...
ఆ... మసక ఎన్నెలల్లే నీవు ఇసక తిన్నె చేరుతావు
గసగసాల కౌగిలంత గుసగుసల్లె మారుతావు
ప్రేమంటే... నీ ప్రేమేనా...

చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
ఆ... ఆనందమేనా... ఆనందమేనా...
నువ్వేనా... నా నువ్వేనా
నువ్వేనా... నాకు నువ్వేనా


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.