శుక్రవారం, అక్టోబర్ 30, 2015

లల్లిలలా లల్లిలలా...

అట్లతద్ది సందర్బంగా అమ్మాయిలకు శుభాకాంక్షలు తెలుపుతూ మాయాబజార్ లోని ఈ పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఇదేపాట వీడియొ కలర్ లో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మాయాబజార్ (1957)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి
గానం : సుశీల

లల్లిలలా లల్లిలలా ఆ ఆ
లల్లిలల లల్లిలల లల్లి లల్లి లల్లిలల
లల్లిలల లల్లిలల లల్లి లల్లి లల్లిలల
అల్లిబిల్లి ఆటలే లల్లిలలా పాటలే
అల్లిబిల్లి ఆటలే లల్లిలలా పాటలే
ఎవరెవరే కోయిలలు
కుహూ కుహూ కుహూ కుహూ
ఎవరెవరె నెమళ్ళు ఆ ఆ కికి కికి కికి కికి
ఎవరెవరె ఎవరెవరె వన్నె లేడి పిల్లలు
ఎవరెవరె ఎవరెవరె వన్నె లేడి పిల్లలు
లల్లిలల లల్లిలల లల్లి లల్లి లల్లిలల
ఎవరెవరె ఎవరెవరె మల్లి లేడి పిల్లలు
లల్లిలల లల్లిలల లల్లి లల్లి లల్లిలల
కు కు కు

అల్లీబిల్లీ అమ్మాయికి
చల చల్లని జోస్యం చెపుతాము
తన చక్కని జోస్యం చెపుతాము

అల్లీబిల్లీ అమ్మాయికి
చల చల్లని జోస్యం చెపుతాము
తన చక్కని జోస్యం చెపుతాము

యవ్వన శోభల పర్వమే
ఇది బావను తలచుకు గర్వమే
యవ్వన శోభల పర్వమే
ఇది బావను తలచుకు గర్వమే
ఆ బావే తనకిక సర్వమే

అల్లీబిల్లీ అమ్మాయికి
చల చల్లని జోస్యం చెపుతాము
తన చక్కని జోస్యం చెపుతాము

వున్నమాటకి ఉలుకెందుకు
మరి ఉన్నదె చెపుతాము
వున్నమాటకి ఉలుకెందుకు
మరి ఉన్నదె చెపుతాము
వలదన్నా చెపుతాము
నూతన విద్యల ప్రవీణుడే
బల్ ప్రతిభావంతుడె మీ బావ
నూతన విద్యల ప్రవీణుడే
బల్ ప్రతిభావంతుడె మీ బావ
అతి చతుర వీరుడే మీ బావ

అల్లీబిల్లీ అమ్మాయికి
చల చల్లని జోస్యం చెపుతాము
తన చక్కని జోస్యం చెపుతాము

మల్లీ జాజి మలతి సంపెగ
పూల బాణములు వేసెను
మల్లీ జాజి మలతి సంపెగ
పూల బాణములు వేసెను
బాలామణితో మురిసేను
మన బాలామణితో మురిసేను
తన పెళ్ళికి బావను పిలిచేను

అల్లీబిల్లీ అమ్మాయికి
చల చల్లని జోస్యం చెపుతాము
తన చక్కని జోస్యం చెపుతాము

2 comments:

అబ్బా..అట్ల తద్ది వచ్చిందంటే చాలు యెన్నెన్ని ఆటలాడే వాళ్ళమో..సబ్జా విండోర్, కరెంట్ షాక్, కలర్ కలర్ వాట్ కలర్, అసలు టైమే తెలిసేదే కాదు..ఒక్క సారిగా రింగుల ఫ్లాష్బాక్ లోకి వెళ్ళిపోయాను సుమండీ..

హహహ ఆటల పేర్లు బాగున్నాయండీ :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.