సోమవారం, అక్టోబర్ 05, 2015

మావయ్య అన్న పిలుపు..

కె.వి.మహదేవన్ గారి సంగీత సారధ్యంలో వెన్నెలకంటి గారు రాసిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం: ముద్దుల మావయ్య (1989)
సంగీతం: కె.వి. మహదేవన్
రచన : వెన్నెలకంటి
గానం : బాలు, సుశీల, శైలజ

పుల్ల మావిళ్ళు కోరి పిల్ల వేవిళ్ల కొచ్చె 
ఒళ్ళో చలివిళ్లు పెట్టరే.. 
తాన తందాన నాన తానా తందాన నాన
తాన తందాననాననా..

మల్లె పందిళ్ళు వేసి తల్లో జాజుల్లు పెట్టి
కొత్త గాజుల్లు వెయ్యరే..
తాన తందాన నాన తానా తందాన నాన
తాన తందాననాననా..
 
ఆ..మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు

కమ్మగా పాడనా చంటి పాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల

మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు

తందన తానానా తందన తానాన 
తందన తానానా తందన తానానన
తందాన తానా తందాన తానా..
తందాన తానా తందాన తానా..

అరచేత పెంచాను చెల్లిని 
ఈ అరుదైన బంగారు తల్లిని
అడుగేస్తే పాదాలు కందవా 
నా కన్నుల్లో కన్నీళ్లు చిందవా

అమ్మగా లాలించాడు
నిన్ను.. నాన్నగా పాలించాడు
అన్నగా ప్రేమించాడు .. అన్నీ తానైనాడు

తన ప్రాణంగా నను పెంచాడు ..
ఆ దైవంగా దీవించాడు
నా అన్నలాంటి అన్న ఈ లోకాన లేడు

మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు

పట్టు చీర కట్టి సారె పెట్టారే.. 
దిష్టి చుక్క పెట్టి హారతివ్వారే..
అందాల కొమ్మా..నీళ్ళాడెనమ్మా 
అక్షింతలేసి దీవించరమ్మా.. 

ఆరు ఏడు మాసాలు నిండగా ..
ఈ అన్నయ్య కలలన్ని పండగ
తేవాలి బంగారు ఊయల.. కావాలి మా ఇల్లు కోవెల
రెప్పగా నిను కాచనా.. పాపగా నిను చూడనా
రేపటి ఆశ తీరగా.. నీ పాపకు జోల పాడనా

ఇది అరుదైన ఒక అన్న కధ
ఇది మురిపాల ఒక చెల్లి కధ
ఇది చెల్లెలే కాదులే నను కన్న తల్లి

మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
కమ్మగా పాడనా చంటి పాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.