గురువారం, అక్టోబర్ 01, 2015

అలనాటి రామచంద్రుడి..

మణిశర్మ స్వరకల్పన లో సిరివెన్నెల గారు రాసిన ఈ అందమైన పెళ్ళిపాటను అంతే అందంగా కృష్ణవంశీ గారు చిత్రీకరించారు. మరి ఆ విశేషమేంటో మనమూ మరోసారి చూసి ముచ్చటపడదాం రండి. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మురారి (2001),
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : మణిశర్మ,
గానం : జిక్కి, సంధ్య, సునీత

ఆ… ఆ… ఆ… ఆ…
అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి
అ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి

అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి
అ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి
ఆ… ఆ… ఆ… ఆ…
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
ఆ… ఆ… ఆ… ఆ…

చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా


పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ వ్రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపున ముద్దగా తడిసిన తుంటరి జలకాలు

అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ…
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళగల జంటని పదిమంది చూడండి
తళతళ మెరిసిన ఆనందపు తడిచూపుల అక్షితలేయండి

చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా


సీతారాముల కల్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపాన
గౌరిశంకరులు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా
మరగ లేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన

దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
ఆ… ఆ… ఆ… ఆ…
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి

చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
 
ఆ… ఆ… ఆ… ఆ…
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.