శనివారం, అక్టోబర్ 10, 2015

ప్రియతమ లలనా..

చక్రవర్తి గారి పాటలలో కొన్ని భలే ఆకట్టుకుంటాయ్ అలాంటి పాటలలో ఇదీ ఒకటి... ఒక చక్కని రిథమ్ లో హాయిగా సాగే పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లొడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రావణ సంధ్య (1986)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం :
గానం : బాలు, జానకి

ప్రియతమ లలనా.. ఆఆ..ఆఆ..
గోరింటాకు పొద్దుల్లోనా
తాంబూలాలా ముద్దిస్తావా కొసరీ కొసరీ..
సన్నాయంటీ నడుమే ఇచ్చి సందేళలో

ప్రియతమ వదనా.. ఆఆ..ఆఅ..
తాంబూలాలా ముద్దే ఇస్తే
పరువాలన్నీ పండిస్తావా వలచీ పిలచీ
కవ్వించేటీ కన్నే కొట్టీ కౌగిళ్ళతో.. 


సంపంగీ పువ్వుల గిన్నెలలోనా
పచ్చని సాయంత్రమే దాగిపోయే..
పున్నాగా పువ్వుల దోసిలి లోనా
గాలికి గంధాలు చెలరేగిపోయే.. 
సొగసుల రుచులే చూడాలంటా
వయసుకు పరువం రావాలంటా 
కలలే నిజమై.. కలలే నిజమై
సిగ్గే పుట్టీ చిరునవయ్యే రసలీలలో..ఓఓ..

ప్రియతమ వదనా.. ఆఆ..
తాంబూలాలా ముద్దే ఇస్తే
పరువాలన్నీ పండిస్తావా
కొసరీ కొసరీ..
సన్నాయంటీ నడుమే ఇచ్చి సందేళలో

వేసంగీ వేడిఊపిరి సోకీ
పెదవులలో తేనెలే కాగి పోయే

పలకల్లో అందాలెన్నొ పెరిగి
తీరని దాహాలు సుడి రేగి పోయే..
పొదలో దీపం వెలగాలంటా 
ఎదలో వెన్నెల చిలకాలంటా
మనలో మనమై మనలో మనమై
కాలం లోకం అన్నీ మరిచే బంధాలలో


ప్రియతమ లలనా.. ఆఆ
..
గోరింటాకు పొద్దుల్లోనా
తాంబూలాలా ముద్దిస్తావా కొసరీ కొసరీ..
సన్నాయంటీ నడుమే ఇచ్చి సందేళలో

ప్రియతమ వదనా.. ఆఆ..
తాంబూలాలా ముద్దే ఇస్తే
పరువాలన్నీ పండిస్తావా వలచీ పిలచీ
కవ్వించేటీ కన్నే కొట్టీ కౌగిళ్ళతో.. 
ఓఓ..
ఓఓ.. ఓఓ.. ఓఓ..
ఓఓ..
  

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.