గురువారం, అక్టోబర్ 08, 2015

బోటనీ పాఠముంది..

తెలుగు సినిమా చరిత్రలో ఒక మేలి మలుపైన "శివ" చిత్రంలోని ఒక సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శివ (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : SP.బాలు, SP.శైలజ, బృందం

బోటనీ పాఠముంది..మ్యాటనీ ఆట ఉంది
దేనికో ఓటు చెప్పరా
హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది
సోదరా ఏది బె స్టురా
బోటనీ క్లాసంటే బోరు బోరు
హస్టరీ రొస్టు కన్నా రెస్టు మేలు
పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు
బ్రేకులు డిస్కోలు చూపుతారు

జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం 
జగడ జగడ జగడ జగడజాం  
జగడ జగడ జగడ జగడజాం 

దువ్వెనే కోడిజుత్తు నవ్వెనే ఏడ్చినట్టు 
ఎవ్వరే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు
ఎవ్వరీ వింత గరీబు
జోరుగా వచ్చాడే జేమ్స్‌బాండు
గీరగా వేస్తాడే ఈల సౌండు
నీడలా వెంటాడే వీడి బ్రాండు
ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు

జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం 
జగడ జగడ జగడ జగడజాం  
జగడ జగడ జగడ జగడజాం

అయ్యో... మార్చినే తలచుకుంటే
మూర్ఛలే ముంచుకొచ్చె
మార్గమే చెప్పు గురువా...
ఆ... ఛీ... తాళం రాదు మార్చిట మార్చి
తాళంలో పాడరా వెధవా
మార్చినే తలచుకుంటే
మూర్ఛలే ముంచుకొచ్చె
మార్గమే చెప్పు గురువా...
కొండలా కోర్సువుంది ఎంతకీ
తగ్గనంది ఏందిరో ఇంత గొడవ
ఎందుకీ హైరానా వెర్రినాన్నా
వెళ్లరా సులువైన దారిలోనా
ఉందిగా సెప్టెంబర్ మార్చిపైనా
హోయ్ వాయిదా పద్ధతుంది దేనికైనా

మ్యాగ్జిమమ్ మార్కులిచ్చు 
మ్యాథ్స్‌లో ధ్యాసవుంచు
కొద్దిగా ఒళ్ళు వంచరా ఒరేయ్..
తందనా తందననన్ తందనా
తందననన్ తందనా తందననన్నా
క్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫుపై పెట్టుకాస్త 
ఫస్ట్ ర్యాంక్ పొందవచ్చురోయ్
తందనా తందననన్ తందనా
తందననన్ తందనా తందననన్నా

అరె ఏం సార్...
లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్ళు
లక్కుతోని లచ్చలల్ల మునిగిపోతరు
పుస్కాల్తో కుస్తీలు పట్టెటోళ్ళు
సర్కారీ క్లర్కులై మురిగిపోతరు

జగడ జగడ జగడ జగడజాం... 
జగడ జగడ జగడ జగడజాం... 
జగడ జగడ జగడ జగడజాం... 
జగడ జగడ జగడ జగడజాం...

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.