మహాకవి కాళిదాసు చిత్రంలోని ఈ అమ్మవారి పాటను దేవీ నవ రాత్రులలో రెండవరోజైనా ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : మహాకవికాళిదాసు (1960)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు
గానం : పి.లీల, రత్నం బృందం
శ్రీకరమగు పరిపాలన నీదే జగదీశ్వరీ
లోకావన నిత్యవ్రతమీవే భువనేశ్వరీ
శ్రీకరమగు పరిపాలన నీదే జగదీశ్వరీ
నీ కృపా కటాక్షములే సకల శుభములొసగగా
నీ కృపా కటాక్షములే సకల శుభములొసగగా
ఇహ పరముల కాధారము మహాలక్ష్మి నీవేగా
శ్రీకరమగు పరిపాలన నీదే జగదీశ్వరీ
నీ వీణా నాదములో వేదములే పలుకగా
నీ వీణా నాదములో వేదములే పలుకగా
జటజగములు మేలు కొలుపు మహావాణి నీవెగా
శ్రీకరమగు పరిపాలన నీదే జగదీశ్వరీ
నీవిజయ విహారములే లోక రక్షలౌనుగా ఆఅ..
నీవిజయ విహారములే లోక రక్షలౌనుగా
అభయమొసగి భువనమేలు మహాకాళి నీవెగా
శ్రీకరమగు పరిపాలన నీదే జగదీశ్వరీ
లోకావన నిత్యవ్రతమీవే భువనేశ్వరీ
శ్రీకరమగు పరిపాలన నీదే జగదీశ్వరీ
2 comments:
అమ్మవారి పాటలలో రేర్ గా వినిపించే పాట..మా అమ్మకి చాలా ఇష్టమైన పాట..ఈ పాటతో అటు ఆంవారినీ..ఇటు అమ్మనీ కూడా గురుతు చేసినందుకు థాంక్సండీ..
వావ్ అవునా.. గుడ్ టు నో దట్ శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.