మిత్రులందరకూ విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో అర్చించుకుంటూ ఉషాపరిణయం చిత్రంలోని ఈ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ఉషాపరిణయం (1961)
సంగీతం : ఎన్.హనుమంతరావు
సాహిత్యం : సదాశివబ్రహ్మం
గానం : జమునారాణి
జయజయ శ్రీరాజరాజేశ్వరీ
జయజయ శ్రీరాజరాజేశ్వరీ
మముదయజూడుమా
మముదయజూడుమా
నిను సేవింతునో శివ ప్రియభామిని
జయజయ శ్రీరాజరాజేశ్వరీ
జగముల కల్పించి కాపాడు తల్లీ
జగముల కల్పించి కాపాడు తల్లీ
నిగమ వినోదిని శ్రిత కల్పవల్లీ
జనని భవాని నటరాజ రాణి
జనని భవాని నటరాజ రాణి
సతతము నిన్నే సేవింతుమమ్మా
జయజయ శ్రీరాజరాజేశ్వరీ
సౌజన్య శీలా నీ విశ్వలీల
భ్రహ్మాదులైనా కనలేరుగా
సౌజన్య శీలా నీ విశ్వలీల
భ్రహ్మాదులైనా కనలేరుగా
నేనెంతదాన నీ మహిమ తెలియా
గిరిరాజ తనయా కరుణింపవా..
నేనెంతదాన నీ మహిమ తెలియా
గిరిరాజ తనయా కరుణింపవా..
జనని భవాని నటరాజ రాణి
జనని భవాని నటరాజ రాణి
సతతము నిన్నే సేవింతుమమ్మా
జయజయ శ్రీరాజరాజేశ్వరీ
మముదయజూడుమా
మముదయజూడుమా
నిను సేవింతునో శివ ప్రియభామిని
జయజయ శ్రీరాజరాజేశ్వరీ
సంగీతం : ఎన్.హనుమంతరావు
సాహిత్యం : సదాశివబ్రహ్మం
గానం : జమునారాణి
జయజయ శ్రీరాజరాజేశ్వరీ
జయజయ శ్రీరాజరాజేశ్వరీ
మముదయజూడుమా
మముదయజూడుమా
నిను సేవింతునో శివ ప్రియభామిని
జయజయ శ్రీరాజరాజేశ్వరీ
జగముల కల్పించి కాపాడు తల్లీ
జగముల కల్పించి కాపాడు తల్లీ
నిగమ వినోదిని శ్రిత కల్పవల్లీ
జనని భవాని నటరాజ రాణి
జనని భవాని నటరాజ రాణి
సతతము నిన్నే సేవింతుమమ్మా
జయజయ శ్రీరాజరాజేశ్వరీ
సౌజన్య శీలా నీ విశ్వలీల
భ్రహ్మాదులైనా కనలేరుగా
సౌజన్య శీలా నీ విశ్వలీల
భ్రహ్మాదులైనా కనలేరుగా
నేనెంతదాన నీ మహిమ తెలియా
గిరిరాజ తనయా కరుణింపవా..
నేనెంతదాన నీ మహిమ తెలియా
గిరిరాజ తనయా కరుణింపవా..
జనని భవాని నటరాజ రాణి
జనని భవాని నటరాజ రాణి
సతతము నిన్నే సేవింతుమమ్మా
జయజయ శ్రీరాజరాజేశ్వరీ
మముదయజూడుమా
మముదయజూడుమా
నిను సేవింతునో శివ ప్రియభామిని
జయజయ శ్రీరాజరాజేశ్వరీ
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో నేడు శంకుస్థాపన జరుపుకుంటున్న మన ఆంధ్రప్రదేశ రాష్ట్ర రాజధాని "అమరావతి" నగరం శరవేగంగా నిర్మాణాన్ని పూర్తిచేసుకుని ఆంధ్రులకు గర్వకారణంగా నిలవాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ బృహత్కార్యంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ రాముడు భీముడు చిత్రంలోని ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : రాముడు భీముడు (1964)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : ఘంటసాల, మాధవపెద్ది సత్యం,పి.సుశీల
ఉందిలే మంచికాలం ముందు ముందునా
అందరూ సుఖపడాలి నందనందనా
ఉందిలే మంచికాలం ముందు ముందునా
అందరూ సుఖపడాలి నందనందనా
ఉందిలే మంచికాలం ముందు ముందునా
అందరూ సుఖపడాలి నందనందనా
ఉందిలే...
ఎందుకో సందేహమెందుకో
రానున్న విందులో నీవంతు అందుకో
ఎందుకో సందేహమెందుకో
రానున్న విందులో నీవంతు అందుకో
ఆ రోజూ అదిగో కలదూ నీ ఎదుట...
నీవే రాజువటా ..ఆఅ..ఆఅ..ఆఅ
ఉందిలే మంచికాలం ముందు ముందునా
అందరూ సుఖపడాలి నందనందనా
ఉందిలే...
ఏవిటేవిటేవిటీ మంచికాలమంటున్నావు
ఎలాగుంటుందని విశదంగా చెప్పు
దేశ సంపద పెరిగేరోజు
మనిషి మనిషిగా బ్రతికేరోజు
దేశ సంపద పెరిగేరోజు
మనిషి మనిషిగా బ్రతికేరోజు
గాంధి మహాత్ముడు కలగన్న రోజు
నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు
ఆ రోజెంతో దూరం లేదూరన్నయ్యో
అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో
ఆ రోజెంతో దూరం లేదూ రండయ్యో
అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో
భలే భలే బాగా సెప్పావ్
కానీ అందుకు మనమేం చేయాలో
అదికూడా నువ్వే చెప్పు
అందరికోసం ఒక్కడు నిలిచి
ఒక్కనికోసం అందరు కలసి
అందరికోసం ఒక్కడు నిలిచి
ఒక్కనికోసం అందరు కలసి
సహకారమే మన వైఖరి ఐతే
ఉపకారమే మన ఊపిరి ఐతే
పేద గొప్పా భేదం పోయీ అందరూ
నీది నాదని వాదం మాని ఉందురూ
ఆ రోజెంతో దూరం లేదూ రన్నయ్యో
అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో
ఆఆ.ఆ..ఆఆఅ..ఆఅ..ఆఆ..
ఆఆఅ.ఆఆఅ..ఆ..ఆఆ
తీయగా బ్రతుకంతా మారగా
కష్టాలు తీరగా సుఖశాంతులూరగా
ఆకాశ వీధుల ఎదురే లేకుండా
ఎగురును మన జెండా
ఆఆఅ..
ఉందిలే మంచికాలం ముందు ముందునా
అందరూ సుఖపడాలి నందనందనా
ఉందిలే మంచికాలం ముందు ముందునా
అందరూ సుఖపడాలి నందనందనా
ఉందిలే...
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
మన రాజధాని మన అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈ రోజు లైవ్ లో ఇక్కడ వీక్షించవచ్చు.
2 comments:
మీకూ దసరా శుభాకాంక్షలు వేణూజీ..నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు యే మేన్ విత్ మిషన్..లేదంటే ఇంత తక్కువ సమయం లో రాజధాని శంకుస్థాపన అసాధ్యం..ఆయనకి ఆ రాజరాజేశ్వరీ అమ్మవారు అనంతమైన శక్తిని ప్రసాదించాలని ఆకాంక్ష..ఆ అంబరాన ఉన్న అమరావతి అంత కీర్తిని మన అమరావతీ పొందాలని ఆశ..
థాంక్స్ ఫర్ ద కామెంట్ అండ్ విషెస్ శాంతి గారు.. అవునండీ చంద్రబాబు సంకల్పబలం పని చేసే తీరు అభినందనీయం.. మీరన్నట్లే మన అమరావతి అజరామరమైన కీర్తిని సొంతం చేసుకోవాలని కోరుకుందాం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.