శనివారం, అక్టోబర్ 24, 2015

ఈ మనసే సెయ్ సెయ్..

పవన్ కి స్టార్ స్టేటస్ ని ఇచ్చి అప్పటి కుర్రకారుని ఒక ఊపు ఊపేసిన చిత్రం తొలిప్రేమ లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : తొలిప్రేమ (1998)
సంగీతం : దేవా,
రచన : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బాలు

అలబలబ అలబలబ హెహె "6"
ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
పరిగెడుతోంది నీకేసి, వినమంటొందీ తన ఊసే
అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే

ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్

ఎన్నో కలలను చూసి కన్నే కునుకొదిలేసే
నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే
ఎన్నో కలలను చూసి కన్నే కునుకొదిలేసే
నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే

కోరుకున్న తీరాన్నే తాను చేరినా
తీరిపోని ఆరాటంతొ కలవరించెనా
తనకని తిరుగుతూ చెలిజత విడువదు
దొరికిన వరమది కుదురుగ ఉండదు

ఏం చేస్తే బాగుంటుందో చెప్పని వింత నసే

ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్

హాలబ హాలబ
అలబా అలబా అలబా అలబా అలబా అలబా
నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే
ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశె
నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే
ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశె

వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా
వెన్నలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా
తహ తహ తరగదు అలజడి అణగదు
తన సొద ఇది అని తలపులు తెలుపదు
ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏం వరసే

ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్

పరిగెడుతోంది నీకేసి, వినమంటొందీ తన ఊసే
అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే

ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్ 

2 comments:

దేవా మాస్ బీట్స్ ఐనా క్లాస్ మెలొడీస్ ఐనా చాలా అందం గా ట్యూన్ చేస్తారు..

అవును శాంతి గారు దేవా మంచి మ్యూజిక్ ఇచ్చేవారు. థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.