ఆదివారం, అక్టోబర్ 25, 2015

ఓ మగువా నీతో...

సుమంత్ నటించిన సినిమాలన్నిటిలోకి "సత్యం" ది ఒక ప్రత్యేక స్థానం. పాటలు సినిమా కూడా ఎంత సూపర్ హిట్ అయ్యాయో చెప్పక్కరలేదు అలాంటి సినిమాలో ఒక చక్కని ప్రేమ గీతం ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సత్యం (2003)
సంగీతం : చక్రి
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్
గానం : చక్రి

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...
కాళిదాసులాగ మారి కవితే రాసేశా!

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా!
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా
పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేశా

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా!
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా
పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేశా

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...
కాళిదాసులాగ మారి కవితే రాసేశా!

ట్రిపుల్ ఎక్స్ రమ్ములోన కిక్కులేదు హల్లో మైనా
నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా
సన్‌లైట్ వేళ నుంచి మూన్‌లైట్ వేళ్లేదాకా
ఫుల్ టైమ్ నా గుండెల్లో ధాట్‌లన్నీ నీవేగా
ఓ లలనా ఇది నీ జాలమా
నీ వలన మనసే గాయమా
కుదురేమో లేదాయే నువు
నమ్మవుగాని కలవరమాయె
ఓ మగువా... ఓ మగువా... ఓ మగువా... ఏయ్

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా!

కో అంటే కోటి మంది అందగత్తెలున్నా గాని
నీ జంటే కోరుతుంటే దంచుతావె కారాన్ని
క్రేజీగా ఉంటే చాలు ప్రేమలోన పడతారండి
ట్రూ లవ్వే చూపుతుంటే పెంచుతారు దూరాన్ని
ఓ మగువా నీకే న్యాయమా
ఎదలో ప్రేమే శాపమా
మనసేమో బరువాయె...
నీ మాటలు లేక మోడైపోయె
మగువా... ఓ మగువా... ఓ మగువా...

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...
కాళిదాసులాగ మారి కవితే రాసేశా!
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా!




2 comments:

ఈ పాట బిగినింగ్ లో వచ్చే హమ్మింగ్ "సునొ లక్కీ ఆలి" లో "షాం సవేరా" సాంగ్ లానే ఉంటుంది..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.