బుధవారం, డిసెంబర్ 18, 2019

తిరుప్పావై 3 ఓంగి ఉలగళన్ద...

ధనుర్మాసం లోని మూడవ రోజు పాశురము "ఓంగి ఉలగళన్ద". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం

పెరిగి లోకముల్ కొలిచిన పెద్ద వేల్పు
ఉత్తముని పేరు నుతియించి నోము నోవా

చెడ్డ తొలగును మంచే చేరుచుండు
నెలకు ముమ్మారు వర్షించు నేలయంతా

పాడి పంటలు చూపట్టు భాగ్యమబ్బు
జనులకెప్పుడు శుభములే జరుగుచుండు

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు. 
 
 
ఓంగి యులకళన్ద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నమ్పావైక్కు చ్చాత్తి నీరాడినాల్,
తీంగిన్ఱి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు,
ఓంగు పెరుం శెన్నెలూడు కయలుగళ,
పూంగువళైప్పోదిల్ పొఱివణ్డు కణ్పడుప్ప,
తేంగాదే పుక్కిరున్దు శీర్తములై పత్తి
వాంగ, క్కుడమ్ నిఱైక్కుమ్ వళ్ళళ్ పెరుమ్బశుక్కళ్,
నీంగాద శెల్వమ్ నిఱైన్దేలో రెమ్బావాయ్

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి మూడవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.

 
ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి

వన్నెల చిన్నెల చిన్నారులారా
పుణ్యమైన వ్రతమాచరించరా

బలిదానముతో ప్రబలిన వాని
లలితలలితమౌ వామన రూపుని
సలలిత స్వరముల గానము చేసీ
జలకములాడీ వ్రతమును జరుపగా

హర్షముతో భువి వర్షించగను
కర్షక శ్రమలకు ఫలితము దక్కును
పెరుగగ పైరులు చేపలు ఎగురగ
కమలం కౌగిట భ్రమరంపును కదా

బస్యమై గోవుల పాలు వెన్నలతో
సస్యశ్యామలమై రేపల్లెయంతయు
గోపాంగనలు చేయగ వ్రతము
ఈ పల్లెయంతయు శోభలు చిందగా

వన్నెల చిన్నెల చిన్నారులారా
పుణ్యమైన వ్రతమాచరించరా

 

4 comments:

జై శ్రీమన్నారాయణ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

Your painstaking effort for the tiruppavai songs is appreciable.

Thanks a lot for your encouragement అజ్ఞాత గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.