సోమవారం, డిసెంబర్ 23, 2019

తిరుప్పావై 8 కీழ்వానమ్ వెళ్ళెన్ఱు...

ధనుర్మాసం లోని ఎనిమిదవ రోజు పాశురము "కీழ்వానమ్ వెళ్ళెన్ఱు". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
 తూరుపు తెల తెల వారెను
దూరమరిగె మేయా
గేదెల గుంపులు నాయకమ్మా
గమ్యమును జేరు 

సఖురాండ్రా గమనమాపి
వచ్చినారము నినుబిలువ 

వనజ నయనా 

కేశి రాక్షసు చీల్చినా కేశవుండు
మానులిద్దరి కూల్చిన మాధవుండు
దేవ దేవుడౌ శ్రీ కృష్ణుని తెలిసి కొలువ
ఆర్తి గుర్తించి ఆతడే ఆదుకొనును 


ఆర్తి గుర్తించి ఆతడే ఆదుకొనును

 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి ఎనిమిదవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
కీழ்వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱువీడు,
మేయ్ వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్,
పోవాన్ పోగిన్ఱారై పోగామల్ కాత్తు, ఉన్నై
క్కూవువాన్ వందు నిన్ఱోమ్ కోదుకలముడైయ
పావాయ్ ! ఎழுన్దిరాయ్! పాడిప్పఱై కొండు
మావాయ్ ! పిళన్దానై మల్లరై మాట్టియ,
దేవాదిదేవనై శెన్ఱు నాం శేవిత్తాల్,
ఆవావెన్ఱారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్.


సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి ఎనిమిదవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి 

 
కోడికూసెను తెల్లవారెను
పాడి పశువులు మేతకెళ్ళెను
చూడ చూడగా భానుడెదిగెను
లేచి రావమ్మా...

ఆడపడుచులు వ్రతము చూడగా
జోడు జోడుగా పరుగులిడగా
వేడుకొనుచూ ఆగినాము
మేడక్రిందనే నిలిచినామూ


హంసతూలిక తల్పమొదలి
హర్షమంతయూ ఆత్మ నిలిపి
పంచభానుని మరచి పొమ్మా
పంచగమనా నిదుర లెమ్మా

వ్యధలనన్నియు మంట గలిపి
మధుర నాధుని భజన సలిపి
వ్రతమునందలి పరణు పొంది 
చతుర్విధముల ఫలితమొంది 


అశ్వరూపులైన అసురులందరిని
మల్లులందరి చీల్చి చంపిన
దేవి దేవతలంత పొగడిన
ఆది దేవును ఆశ్రయించగా
మంద గమనా నిదురలెమ్మా

కోడికూసెను తెల్లవారెను
పాడి పశువులు మేతకెళ్ళెను
చూడ చూడగా భానుడెదిగెను
లేచి రావమ్మా... 
 

  

2 comments:

సర్వ మోహనా..గోపాలా..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.