ఆదివారం, డిసెంబర్ 22, 2019

తిరుప్పావై 7 కీశుకీశె న్ఱెంగుం...

ధనుర్మాసం లోని ఏడవ రోజు పాశురము "కీశుకీశె న్ఱెంగుం". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
  కీచు కీచుమని
పక్షులు కేరుచుండె
పెరుగు చిల్కంగ భామినుల్
పెద్ద శబ్దమగుచుండె 


భూషణమధన గాఢ శబ్దముల్
కలసి వినవె సఖియా
పిచ్చి దానవే లేవవే
నీ వ్రతంబు చేయా
కాంతి గల గాన
నాయకు కన్నెవీవు


పాడవలయును మముగూడి
పద్మనాభు గూర్చీ
తెరవా ఇకనైనా
తలుపులు తెరవవమ్మా 

 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి ఏడవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
కీశుకీశె న్ఱెంగుం ఆనై చాత్తన్, కలన్దు !
పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో ! పేయ్ ప్పెణ్ణే !
కాశుమ్ పిఱప్పుమ్ కలగలప్ప క్కైపేర్తు,
వాశ నఱుం కుழలాయిచ్చియర్, మత్తినాల్
ఓశై ప్పడుత్త త్తయిరరవమ్ కేట్టిలైయో,
నాయగ ప్పెణ్బిళ్ళాయ్ ! నారాయణన్! మూర్తి!,
కేశవనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో,
తేశ ముడైయాయ్! తిఱవేలో రెమ్బావాయ్.


సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి ఏడవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి 

 
ఓ పిచ్చిపిల్లా తెల్లారెనమ్మా
ఓపిక తో నిదురింక చాలించి లెమ్మా
చాలించి లెమ్మా

కీచు కీచుమని భరద్వాజమ్ములూ
కిలకిల ధ్వనులతో ఏవేవో పిలుపులు
పగలైతే కలవమనీ తెలిపేటీ కులుకులు
మగువరో వినలేదా ఆ చిలుక పలుకులు


విరులన్నీ కురులనూ విడిచి పోయినా గానీ
మరుమల్లె వాసనలా మత్తు విడిపోనీ
గొల్ల పడుచులు చల్ల చిల్కగా ఆఆఆఆ
కంకణ కంఠ హారమ్ములా ధ్వనులు వినలేదా

అన్ని వస్తువులందు హత్తుకొని ఉండియు
కన్నులకు మనకెప్పుడు కనపడుచూ ఉండు
ఆ కన్నయ్యగా పుట్టి హతమార్చె దుష్టులను 
విన్నవించినవన్నీ వినుచూ నిదురింతువా


నీకు న్యాయమా ఇదీ ఓ నాయకీమణి
నీ అందచందాలూ నిగ్గులనూ చూపుటకూ
ఆ స్వామికి అడ్డముగా అటుమళ్ళబోకు
తెరవమ్మా ద్వారమును తిమిరమంతమూ చేయగా

ఓ పిచ్చిపిల్లా తెల్లారెనమ్మా
ఓపిక తో నిదురింక చాలించి లెమ్మా
చాలించి లెమ్మా

 

2 comments:

గానమూర్తే..గోపాలా..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.