గురువారం, డిసెంబర్ 19, 2019

తిరుప్పావై 4 ఆழி మழைక్కణ్ణా...

ధనుర్మాసం లోని నాలుగవ రోజు పాశురము "ఆళి మళైక్కణ్ణా". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
  వానదేవుడా గంభీర వార్ధిన్ జొచ్చి
కడుపునిండ నీరు ద్రావి కదలి వచ్చి
పద్మనాభుని చక్రంబు పగిధి మెరసీ

వాని శంఖంబు రీతిగా ధ్వనిని జేసి
వాని శార్దంబు వెల్వడు బాణ సరళి
మేము నీరాడ లోకముల్ మేలనంగ


కొదువ జూపకా అందరీ కోర్కె దీర
వర్షమీవయ్య చక్కగా వరుణ దేవా
వర్షమీవయ్య చక్కగా వరుణ దేవా 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.  
 

 
ఆழி మழைక్కణ్ణా ! ఒన్ఱు నీ కైకరవేల్,
ఆழிయుళ్ పుక్కు ముకన్దుకొ డార్తేఱి,
ఊழிముతల్వ నురువమ్బోల్ మెయ్ కఱుత్తు,
పాழிయన్దోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్.
ఆழிపోల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱతిర్ న్దు
తాழாదే శార్ ఙ్గ ముదైత్త శరమழைపోల్,
వాழవులకినిల్ పెయ్ దిడాయ్, నాంగళుమ్
మార్గழி నీరాడ మగిழ்న్దేలో రెమ్బావాయ్ 


సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. 
ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழா=ళా
 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి నాలుగవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి
 
పరోపకారా పర్జన్య దేవా
సరాగముతో వర్షించి పోవా
నీ ఔదార్యము నీ దాతృత్వము
నిర్మలమైనది నీవెరుగ లేవా

గంభీర జలధి మధ్యలోకేగి
కుంచించి త్రాగేసి జగమంత మోగి
రమణుల మురిపించు కమనీయ గాత్రా
తంభాన నెరసిన నరహరిని ఎరుగవా


శ్రీచక్రమోలే ధగ ధగ మెరసి
శంఖారావమోలే దడ దడ ఉరిమి
శార్ఘ ధనువుల శరములు కురిపించి
అనుభూతి కలిగించి వర్షించి పోవా

భూలోకమంతయూ పులకించి పోగా
ఈ లోకులెల్లరు హర్షింతుననగా
సంతోషముప్పొంగు మార్గశిరమున
చలివాన జల్లుల జలమ్ములాడగ
 

పరోపకారా పర్జన్య దేవా
సరాగముతో వర్షించి పోవా

 

2 comments:

గోదా దేవ్యైనమః..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.