మంగళవారం, డిసెంబర్ 31, 2019

తిరుప్పావై 16 నాయగనాయ్...

ధనుర్మాసం లోని పదహారవ రోజు పాశురము "నాయగనాయ్". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
నాయకుండౌ మారాజు
నందగోపు మందిరంబును
గాచెడి మాన్యులారా
తలుపు తీయరే
మాయందు దయవహించీ

కృష్ణ దేవుండు మామీద
కృపను బూని 
వ్రతము చేయింతు రమ్మనే
బాలికలమూ గొల్లలము
లోక సౌఖ్యంబు కోరినాము


తొలుతనే కాదనక
మణితలుపు వేగంబుగా తీసి
దయచూపరే మాకు దివ్యులారా
దయచూపరే మాకు దివ్యులారా
    
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి పదహారవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
నాయగనాయ్ నిన్ఱ నన్దగోపనుడైయ
కోయిల్ కాప్పానే!, కొడిత్తోన్ఱుమ్ తోరణ
వాశల్ కాప్పానే!, మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్,
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేర్ న్దాన్,
తోయోమాయ్ వన్దోమ్ తుయిలెழప్పాడువాన్,
వాయాల్ మున్న మున్నమ్ మాత్తాదే అమ్మా!, నీ
నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి పదహారవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


నాయకుడగు నందగోపు భవన రక్షకులారా
సుందర మణిద్వారపు గడితీయరారా
అందమైన తోరణాలు మెరియుచూ ఉండగా
పొందికగా ధ్వజములు పైకెగురుచు ఉండగా

మాయామానుషుడైన మణివర్ణుడు
గేయానికి తోడు పరమిచ్చువాడు
పరమునందుకోగా శుద్ధులమై వచ్చాము
మరేదైన ఇచ్చినా వలదనీ చెప్పేము


శ్రీకృష్ణుని మేలుకొలుపు పాటలెన్నొ పాడేమూ
శ్రీ హరిని సేవించగ ద్వారము కడ నిలిచేము
ద్వారములు ప్రేమతో దగ్గరగా ఐనవయ్య
మారు మాటాడకా మముగావ రావయ్యా

గడియ తీసినా మరు ఘడియ కేమౌతామో
అడుగులు తడబడగా హరిచేర వచ్చాము
పిడుగు వంటి మాట ముందు నువ్వు అనకుము
సతులనూ శ్రీహరి సన్నిధికీ చేర్చుము


నాయకుడగు నందగోపు భవన రక్షకులారా
సుందర మణిద్వారపు గడితీయరారా  

2 comments:

జయ మాధవ..జయ మధుసూదన..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.