ఆదివారం, డిసెంబర్ 29, 2019

తిరుప్పావై 14 ఉఙ్గళ్ పుழைక్కడై...

ధనుర్మాసం లోని పదునాల్గవ రోజు పాశురము "ఉఙ్గళ్ పుழைక్కడై". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
ఇంతి నీ తోట బావిలో
ఎర్రనైన కమలముల్ పూచే
ముకుళించె కలువ పూలు

కావి ధోవతుల్ కట్టి
శంఖంబులూది
అరుగుచున్నారు
సన్యాసులాలయమ్ము


మమ్ము మునుముందు
లేపంగ మాటనిచ్చి
స్థిరము నిద్రింప నీకెంత సిగ్గులేదే

శంఖచక్రముల్ దాల్చిన
జలజ నయను పాడుటకు రమ్ము
గుణవతీ పాన్పు వీడుము
గుణవతీ పాన్పు వీడుము 

   
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి పదునాల్గవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
ఉఙ్గళ్ పుழைక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెఙ్గழுనీర్ వాయ్ నెழకిన్దు ఆమ్పల్ వాయ్ కూమ్బినకాణ్,
శెంగల్ పొడిక్కూఱై వెణ్బల్ తవత్తవర్,
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్,
ఎంగళై మున్నమ్ ఎழுప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్ ఎழுన్దిరాయ్! నాణాదాయ్! నావుడైయాయ్!
శంగొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్,
పంగయక్కణ్ణానై ప్పాడేలో రెమ్బావాయ్.

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి పదునాల్గవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


తీయ తీయగ పలికే పలుకులదానా
శయ్యనింక వదిలేసి తలుపు తీయవా
సిగ్గు బిడియమేమి లేని చిన్న దానవా
మొగ్గ వంటి మోము యున్న మూగదానవా

పెరటి తోటలో ఉన్న పెద్ద కొలనులోను
విరిసినవి కమలాలు ముడిచినవి కలువలు
ఎరుపు గుట్టలు అట్టి మెరిసే పలువరసవారు
పరుగెడుదురు యోగులు పరమాత్మ సేవకై


పరిపూర్ణ జ్ఞానురాల మురిపాల ముద్దుబాల
అరమరికలు లేక నేడు మాట ఇచ్చి మరువనేల
నేటి రవీ రాకముందె మమ్ము మేల్కొలిపేవని
మాటకారి తగునా ఇటు చెప్పి నిదురపోవా

శంఖ చక్ర ధారుడు ఆజానుబాహుడు
సంకటారి శత్రు హారి పుండరీక నందనుడు
జంకు గొంకు మాని వాడి జపతపముల్ ఆచరించ
మంకువీడి లేచిరమ్మ మాధవుని స్తుతియించ


తీయ తీయగ పలికే పలుకులదానా
శయ్యనింక వదిలేసి తలుపు తీయవా
సిగ్గు బిడియమేమి లేని చిన్న దానవా
మొగ్గ వంటి మోము యున్న మూగదానవా


2 comments:

జయ మాధవా..మధుసూదనా..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.