మంగళవారం, డిసెంబర్ 17, 2019

తిరుప్పావై 1 మార్గళి & 2 వైయత్తువాళ్...

ధనుర్మాసం సంధర్బంగా గోదాదేవి రచించిన తిరుప్పావై పాశురములను ఈ ముప్పై రోజులు తలచుకుందాం. తమిళ పాశురములను అందమైన తెలుగులోకి శ్రీమాన్ "ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్" అన్వయించగా వాణీజయరాం గారు పాడారు. మొదటి పాశురము ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం

నీళ కుచగిరి తటమున
నిద్రవోవు కృష్ణు మేల్కొల్పి 
శృతి శతాకృష్టమైన
తనదు పారార్ద్యమెరిగించి
తాను తలను దాల్చి
విడచిన పూదండ త్రాట గట్టి
వశునిగా గొన్న
గోదకు వందనములు
గోదకు వందనములు

హంసలు తిరుగు వరిమళ్ళల
అందమైన విల్లిపుత్తూరు గోదమ్మ
విష్ణు గూర్చి పాడినట్టి
తిరుప్పావు పాశురముల్
తలచినంతనే పాపముల్ తొలగి చనును
తలచినంతనే పాపముల్ తొలగి చనును

తలను దాల్చిన పూదండ తగనిదనక
శ్రీషుకర్పించుచు తనను శ్రీనివాస దేవు
జేర్చుమయని కామదేవు వేడు
గోద మాటలే మాకును కోర్కెలిచ్చు
గోద మాటలే మాకును కోర్కెలిచ్చు

మార్గశీర్షంబు కడు
మంచి మాసమిదియె
మంచి వెన్నెల రాత్రులు
మంచి నగలు కలిగి
సుందరులౌ గోప కన్నెలారా

వేకువనే లేచి మీరాడవెక్కయున్న
రండు నోమును నోచగ రమ్యంబుగా
కలువకంటి యశోద
సింగంపు కొదమనంద
తనయుండు చంద్రార్క నయనధారి
ఆది నారాయణుండె మీ ఆర్తి దీర్చు
మేలు మేలని లోకముల్ మెచ్చుకొనును.
మేలు మేలని లోకముల్ మెచ్చుకొనును. 

రెండవ పాశురము  ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.



భువిని జన్మించి
సుఖియించు పుణ్యులారా
వినుడు మా నోము
నియమముల్ వివరమ్ముగా


క్షీర సాగర శయనుని కీర్తి పాడి
వేకువనే లేచి మీరాడి వేక్కమీరా
శుచులమై యుండి
 కాటుకల్ సుమములిడక
పాలు నేయి భుజింపక
పరమ భక్తి పెద్ద పిన్నల
గుర్తించి ప్రీతి గూర్చి


పలుకరానట్టి పలుకులను పలుక కుండా
చేయరానట్టి పనులను చేయకుండా
మేము నోచెదమందరి మేలు కోరీ 
మేము నోచెదమందరి మేలు కోరీ 

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు ఆ ఎంబెడెడ్ వీడియో ను మీరు ఇక్కడ చూడవచ్చు.


 నీళాతుంగ స్తనగిరితటీసుప్త ముద్బోధ్య కృష్ణం,
పారార్థ్యం స్వం శ్రుతి శత శిరస్సిద్ధ మధ్యాపయన్తీ |
స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుజ్క్తే,
గోదా తసై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః ||

అన్న వయల్ పుదువై యాణ్డాళ్ అరంగర్కు
పన్ను తిరుప్పావైప్పల్ పదియమ్, ఇన్ని శైయాల్
పాడిక్కొడుత్తాళ్ నఱ్పామాలై, పూమాలై
శూడిక్కొడుత్తాళైచ్చొల్లు.
శూడిక్కొడుత్త శూడర్కొడియే తొల్ పావై,
పాడియరుళ వల్ల పల్వళైయాయ్,! నాడి నీ
వేంగడవఱ్కైన్నై విది యెన్ఱ విమ్మాత్తమ్,
నాం కడవా చణ్ణమే నల్ కు.
 

మొదటి పాశురము 
 
మార్గழி త్తింగల్ మది నిఱైన్ద నన్నాళాల్,
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిழைయీర్ !
శీర్ మల్ గు మాయ్ ప్పాడి శెల్వచ్చిఱుమీర్ కాళ్,
కూర్ వేల్ కొడున్దొழிలన్ నన్దగోపన్ కుమరన్,
ఏరార్ న్దకణ్ణి యశోదై యిళం శింగమ్,
కార్ మేని చ్చెంగణ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్,
నారాయణనే నమక్కే పఱై తరువాన్
పారోర్ పుగழప్పడిన్దేలో రెమ్బావాయ్

రెండవ పాశురము ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు

 
వైయత్తు వాழ்వీర్ కాళ్! నాముమ్ నమ్ పావైక్కు,
శెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్
పైయ త్తుయిన్ఱ పరమ నడిపాడి,
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి,
మైయిట్టెழுతోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్ఱోదోమ్,
ఐయముమ్ పిచ్చైయు మాన్దనైయుమ్ కైకాట్టి,
ఉయ్యుమా ఱెణ్ణి ఉగన్దేలోరెమ్బావాయ్.

సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. 
ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழு=ళు
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. ఆ ముప్పై పాటల పూర్తి వీడియో ఇక్కడ చూడవచ్చు.

ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం 
సంగీతం : వి.డి.శ్రీకాంత్ 
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య 
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి 

మార్గళి మాసము వచ్చినదీ
మానిని గోదా మురిసినదీ
పాటలు ముప్పది పాడినదీ
పారమార్ధ్యమును తెలిపినదీ

వన్నెల వలపుల చిన్నారులారా
పుణ్యమైన వ్రతమాచరించరా
వెన్నెల కురిసిన వ్రేపల్లె చూరు
కన్నయ్య మదిలో మీరాడుకోరా


పొందుగ పొన్నలు పూచిన వేళల
నందన సరసుల బృందావనముల
సందుగొందుల నంద యశోదల
అందాల సింగము పొందు కోరరో

కమల రేకుల కన్నుల వాడు
కమనీయ నీల దేహము వాడు
చంద్ర సూర్య సమ తేజుడు వాడు
మంద స్మితమున మది దోచు వాడు


సృష్టికి ఆదిగా నిలిచిన వాడు
అష్టాక్షరిలో ఇమిడిన వాడు
ఇష్టమైన పరమిచ్చెడి వాడు
కష్టములను కడతేర్చువాడు

మార్గళి మాసము వచ్చినదీ  


రెండవ పాశురము

వయసులో ఉన్నట్టి వయ్యారులారా
ప్రియమైన ఈ నోము నోచుకోలేరా

త్వరగ నిద్దుర లేచి జలకలములాడి
క్షీరాభ్ది శయనించు మురవైరి చేరి
పరమ పురుషుని ఎదుట మంగళము పాడీ
మరువక నియమాలు వ్రతము జరిపించుదాం


వెన్నమీగడ పాలు వ్రతములో వాడమని
కన్నులకు నల్లని కాటుక పెట్టమని
విరికన్నెదండలను కురులందు తురమమని
తరుణులు తప్పక ప్రతినెలు చేయగా

పెద్దలకు నచ్చని పనులేవి చేయమని
బుద్ధితో ధనమును దానాలు చేతుమని
సిద్ధులకు భిక్షము మనసార పెడుతుమని
సుద్దులెన్నో చెప్పి స్థుతియించ వేగ


వయసులొ ఉన్నట్టి వయ్యారులారా
ప్రియమైన ఈ నోము నోచుకోలేరా 

 

2 comments:

మాలాంటి కృష్ణ భక్తులకిది అపురూపమైన కానుక..థాంక్యూ..

థాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.