గురువారం, డిసెంబర్ 12, 2019

ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో...

వెంకి మామ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వెంకిమామ  (2019)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : శ్రీమణి
గానం : పృథ్వీ చంద్ర 

ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో
ఒంటికాయ సొంటికొమ్ము
సెంటు కొట్టెరో
ఏ ఊహలు లేని గుండెలో
కొత్త కలల విత్తనాలు
మొలకలేసెరో
ఎడారిలో గోదారిలా
కుడికాలు పెట్టి
అలలు జల్లుతోందిరో
ఏదారికో ఏతీరుకో
ఈ కొంటె అల్లరెళ్ళి
ఆగుతుందిరో

ఈ ఎంకి మామ గుండె
పెంకులెగరగొట్టె టీచరమ్మా
ఈ పెంకి మామ మంకు పట్టు
సంగతేంటొ చూడవమ్మా

ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో
ఒంటికాయ సొంటికొమ్ము
సెంటు కొట్టెరో
ఏ ఊహలు లేని గుండెలో
కొత్త కలల విత్తనాలు
మొలకలేసెరో

హియర్ వి గో
హీ ఈజ్ ద బ్రాండ్ న్యూ
వెంకి మామ వాటె చేంజ్ మామ
హే భామా మామ భామ మామ

హే మీసకట్టు చూడు చీరకట్టు తోటి
సిగ్గే పడుతూ స్నేహమేదొ చేసే
పైర గట్టు చూడు పిల్ల గాలి తోటీ
ఉల్లాసంగా కబురులాడెనే
వానజల్లు వేళ
గొడుగు కింద చోటు కూడా
ఒక్కో అడుగూ తగ్గిపోతు ఉంటే
మండు వేసవేళ
వెన్నెలంటి ఊసు వింటు
ఉల్లాసాలే పెరిగిపోయెనే

ఎడారిలో గోదారిలా
కుడికాలు పెట్టి
అలలు జల్లుతోందిరో
ఏదారికో ఏతీరుకో
ఈ కొంటె అల్లరెళ్ళి
ఆగుతుందిరో

ఈ ఎంకి మామ గుండె
పెంకులెగరగొట్టె టీచరమ్మా
ఈ పెంకి మామ మంకు పట్టు
సంగతేంటొ చూడవమ్మా

ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో
ఒంటికాయ సొంటికొమ్ము
సెంటు కొట్టెరో
ఏ ఊహలు లేని గుండెలో
కొత్త కలల విత్తనాలు
మొలకలేసెరో 
 

2 comments:

ఎవైటింగ్ ఫర్ దిస్ మూవీ..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.