మహర్నవమి సంధర్బంగా మహిషాసుర మర్ధిని అవతారంలో దర్శనమీయనున్న అమ్మవారికి నమస్కరిస్తూ బాలమురళీ కృష్ణ గారు గానం చేసిన ఓ చక్కని పాట తలచుకుందాం. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : పేదరాశి పెద్దమ్మ కథ (1968)
సంగీతం : ఎస్పీ కోదండపాణి
సాహిత్యం : చిల్లర భావనారాయణరావు
గానం : బాలమురళీ కృష్ణ గారు
శివ మనోరంజని
వరపాణీ సర్వరాణీ
కనవే జననీ కృప బూనీ
ఆఆఆఆఆ....
శివ మనోరంజని
వరపాణీ సర్వరాణీ
కనవే జననీ కృప బూనీ
కవికే కనరాని కాంతివి నీవై
కవికే కనరాని కాంతివి నీవై
శ్రుతిలో లయగా సాగే సతివై
శ్రుతిలో లయగా సాగే సతివై
అభినయ శిల్పాల అలరే కళవై
అభినయ శిల్పాల అలరే కళవై
సరస రసిక జన హృదయ కమలముల
వెలుగు కిరణముగ తళుకులొలికితివి
శివ మనోరంజని
మెరసే జలదాల మేదుర నాదం
మెరసే జలదాల మేదుర నాదం
రథమయ్యెను రారమ్మా అమ్మా అమ్మా
మెరసే జలదాల మేదుర నాదం
రథమయ్యెను రారమ్మా అమ్మా అమ్మా
సలలిత గాంధర్వ వరగానమునా
సలలిత గాంధర్వ వరగానమునా
రజితగిరి శిఖరి చలన
చరణ ఝణ ఝణిత ప్రణవ
నటనముల సలుపుమిట
శివ మనోరంజని
శివ మనోరంజని
శివ మనోరంజని
సంగీతం : ఎస్పీ కోదండపాణి
సాహిత్యం : చిల్లర భావనారాయణరావు
గానం : బాలమురళీ కృష్ణ గారు
శివ మనోరంజని
వరపాణీ సర్వరాణీ
కనవే జననీ కృప బూనీ
ఆఆఆఆఆ....
శివ మనోరంజని
వరపాణీ సర్వరాణీ
కనవే జననీ కృప బూనీ
కవికే కనరాని కాంతివి నీవై
కవికే కనరాని కాంతివి నీవై
శ్రుతిలో లయగా సాగే సతివై
శ్రుతిలో లయగా సాగే సతివై
అభినయ శిల్పాల అలరే కళవై
అభినయ శిల్పాల అలరే కళవై
సరస రసిక జన హృదయ కమలముల
వెలుగు కిరణముగ తళుకులొలికితివి
శివ మనోరంజని
మెరసే జలదాల మేదుర నాదం
మెరసే జలదాల మేదుర నాదం
రథమయ్యెను రారమ్మా అమ్మా అమ్మా
మెరసే జలదాల మేదుర నాదం
రథమయ్యెను రారమ్మా అమ్మా అమ్మా
సలలిత గాంధర్వ వరగానమునా
సలలిత గాంధర్వ వరగానమునా
రజితగిరి శిఖరి చలన
చరణ ఝణ ఝణిత ప్రణవ
నటనముల సలుపుమిట
శివ మనోరంజని
శివ మనోరంజని
శివ మనోరంజని
2 comments:
మహర్నవమి శుభాకాంక్షలు వేణూజీ..
మీకు కూడా మహర్నవమి శుభాకాంక్షలు శాంతిగారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.