శుక్రవారం, సెప్టెంబర్ 08, 2017

ముత్యాలు వస్తావా...

అల్లురామలింగయ్య గారిపై చిత్రీకరించిన ఒక సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మనుషులంతా ఒక్కటే (1976)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : కొసరాజు
గానం : బాలు, సుశీల 

ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయారీ
ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయారీ

చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను
చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను
తొందరపడితే లాభం లేదయో

నీ జారు ఫైట ఊరిస్తు ఉందీ
నీ కొంటె చూపు కొరికేస్తు ఉందీ
నీ జారు ఫైట ఊరిస్తు ఉందీ
నీ కొంటె చూపు కొరికేస్తు ఉందీ
కన్నూ కన్నూ ఎపుడో కలిసిందీ

ఏందయ్యగోల.. సిగ్గేమి లేదా
ఊరోళ్ళు వింటే ఎగతాళి గాదా
ఏందయ్యగోల.. సిగ్గేమి లేదా
ఊరోళ్ళు వింటే ఎగతాళి గాదా
నిన్నూ నన్నూ చూస్తే నామరదా

ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయారీ

పరిమినెంటుగాను నిన్ను చేసుకొంటాను
ఉన్నదంత ఇచ్చేసీ నిన్ను చూసుకుంటాను
ఇంటా బయటా పట్టుకునుంటానూ
అహా... ఒహో.. ఏహే.. ఏ..

ఏరుదాటిపోయాక తెప్ప తగల ఏస్తేను
ఊరంతా తెలిసాక వదలి పెట్టి పోతేను
బండకేసి నిను బాదేస్తానయ్యో
రేవులోన నిను ముంచేస్తానయ్యో 

ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయారీ
చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను
తొందరపడితే లాభం లేదయో


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.