పూజ్యులైన గురువులందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ హైహైనాయక చిత్రంలోని ఒక చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ.
చిత్రం : హైహై నాయకా (1989)
సంగీతం : సురేశ్‌చంద్ర (మాధవపెద్ది సురేష్)
సాహిత్యం : ముళ్ళపూడి శాస్ర్తి
గానం : బాలు, మంజునాథ్
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి
ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి
మనసులువిరబూసి మధువులు చిందాలి
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
పురాణాలు వేదాలు రామాయణ భారతాలు
పురాణాలు వేదాలు రామాయణ భారతాలు
కథలెన్నీ వర్ణించినా హితమెంత బోధించినా
దోషిని దండించమని ద్రోహిని ఎదిరించమని
స్వార్థాన్ని పక్కకునెట్టి మానవతను పెంచమని
ఎలుగెత్తి చాటాయి...
పరోపకారం పుణ్యం పరహింసనమే పాపం
పరోపకారం పుణ్యం పరహింసనమే పాపం
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
విభేదాలు వైరాలు కులమత విద్రోహాలు
విభేదాలు వైరాలు కులమత విద్రోహాలు
వివరించే నీతి ఒక్కటే...
సూచించే సూత్రమొక్కటే...
మంచికి విలువీయకుంటే
వంచన విడనాడకుంటే
మతసహనం మాటమరచి
సమతకు తను సమాధికడితే
నరుడే దానవుడవుతాడు
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి
ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి
మనసులు విరబూసి మధువులు చిందాలి
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.